NTR And Trivikram Move update: టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక న్యూఇయర్ సందర్భంగా త్రివిక్రమ్ హీరో ఎన్టీఆర్‌ను కలిసిన ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంకా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, యన్.టీ.ఆర్ ఆర్ట్స్ సినిమా నిర్మాణ సంస్థలు తెలిపారు.
అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీకి చౌడప్పనాయుడు అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళ కాంబోలో రాబోతున్న సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి.
Also Read: బుల్లితెరపై మరోసారి మెరవనున్న ఎన్టీఆర్.. కొత్త టాక్ షోకు నో రెమ్యునరేషన్.!! అసలు సంగతి ఇదే..