ఆ ప్రసక్తే లేదు.. ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చిన కాజల్‌

టాలీవుడ్ చందమామ కాజల్‌ కొత్త జీవితంలోకి ఎంటర్‌ అవ్వబోతోంది. ఈ నెల 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరగనుంది

ఆ ప్రసక్తే లేదు.. ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చిన కాజల్‌

Updated on: Oct 07, 2020 | 12:57 PM

Kajal assure to Fans: టాలీవుడ్ చందమామ కాజల్‌ కొత్త జీవితంలోకి ఎంటర్‌ అవ్వబోతోంది. ఈ నెల 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరగనుంది. ఈ విషయాన్ని చందమామ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు బ్యాచులర్‌ పార్టీ ఫొటోలను కూడా కాజల్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా కాజల్‌ తన వివాహాన్ని ప్రకటించాక చాలా మంది అభిమానుల గుండె పగిలిపోయింది. పెళ్లైతే కాజల్‌ సినిమాలకు గుడ్‌బై చెప్తుందేమోనని వారు తెగ ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాజల్ స్పందించింది.

పెళ్లైన తరువాత కూడా తాను సినిమాలను కంటిన్యూ చేస్తానని కాజల్‌ స్పష్టం చేసింది. నటనను వదిలే ప్రసక్తి లేదని, గౌతమ్‌తో కొత్త జీవితం ప్రారంభించడానికి అందరి ఆశీస్సులు కావాలని కాజల్ వెల్లడించింది. ఇక కాజల్ ఇచ్చిన ఈ ప్రకటనతో ఆమె ఫ్యాన్స్‌ కాస్త రిలీఫ్‌ అయ్యారు. కాగా ప్రస్తుతం కాజల్‌ చిరంజీవి సరసన ఆచార్య, కమల్ సరసన ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు ముంబయి సగ, హే సినామికా, మోసగాళ్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక ఆమె నటించిన క్వీన్ రీమేక్‌ పారిస్ పారిస్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Read More:

త్రివిక్రమ్‌తో మూడోసారి మహేష్‌.. కన్ఫర్మ్ చేసిన సూపర్‌స్టార్‌‌

ఖమ్మం ‘మైనర్’ కేసును సుమోటాగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ

Loading...
Unable to load recommendations.
Follow Us