Nivetha Thomas : ఆకట్టుకునే అందం, అదిరిపోయే అభినయం.. అయినా అవకాశాలు మాత్రం….
మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అన్న ఇమేజ్... టాప్ హీరో సినిమాలో ఛాన్స్.. రీసెంట్‌గా బిగ్గెస్ట్ సూపర్ హిట్. అయినా ఈ బ్యూటీకి....
మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అన్న ఇమేజ్… టాప్ హీరో సినిమాలో ఛాన్స్.. రీసెంట్‌గా బిగ్గెస్ట్ సూపర్ హిట్. అయినా ఈ బ్యూటీకి మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా..? ఇంకెవరండి… సౌత్ హీరోయిన్ నివేదా థామస్ గురించే. తెలుగు, తమిళం, మలయాళం అన్నతేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి.. కెరీర్ లో సెకండ్ గేర్ మాత్రం కూడా పడటం లేదు. టాప్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా… బిజీ హీరోయిన్ అని మాత్రం అనిపించుకోలేకపోతున్నారు. తాజాగా వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా.. నివేదాకు ఆఫర్స్ మాత్రం రావటం లేదు.
వరుసగా… దర్బార్, ‘వి’, వకీల్ సాబ్ సినిమాల్లో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేసినా… నివేదాకు ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు. ప్రజెంట్ ఈ బ్యూటీ కిట్టీలో ఒక్క సినిమా కూడా లేదు. ‘వి’ సినిమాతో గ్లామర్ రోల్స్‌కు కూడా రెడీ అన్న సిగ్నల్స్ ఇచ్చినా.. ఈ టాలెంటెడ్ బ్యూటీని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.
Also Read: సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కేవైసీ రూల్స్ సవరిస్తూ కీలక నిర్ణయం