పెళ్లికి సంబంధించి ఇష్టమైన ఫొటో ఇదేనంటున్న కొణిదెల నిహారిక.. దీనికి కారణం ఏంటో తెలుసా?

నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల వివాహం డిసెంబర్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ది

పెళ్లికి సంబంధించి ఇష్టమైన ఫొటో ఇదేనంటున్న కొణిదెల నిహారిక.. దీనికి కారణం ఏంటో తెలుసా?

Updated on: Dec 28, 2020 | 2:06 PM

నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల వివాహం డిసెంబర్ 9న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ పెళ్లి హడావిడి అంతా ఇంతా కాదు మూడు రోజులు టాలీవుడ్ మొత్తం ఆ పెళ్లిలోనే కనిపించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం చాలా రోజుల తర్వాత నిహారిక పెళ్లిలో సందడి చేసింది.

నిహారిక పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. అయితే పెళ్లి వేడుక‌లో త‌న‌కు ఎంతో ఇష్టమైన ఫొటో ఇదే అంటూ నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో కూడా నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్రస్తుతం నూత‌న దంప‌తులు హ‌నీమూన్ కోసం మాల్దీవుల‌కి వెళ్లి అక్కడి అందాల‌ని ఎంజాయ్ చేస్తున్నారు.