Rajini-Kamal: అనిరుథ్‌ను పక్కకునెట్టిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. బన్నీ, రజినీ సినిమాల్లో ఆఫర్లు

సౌత్ ఇండియాలో చిత్ర విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాలోని పాటలే కాదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉండాలి. ముఖ్యంగా హీరో ఎలివేషన్, ఎంట్రన్స్.. మ్యూజిక్ డైరెక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇటు తెలుగు అటు తమిళంలో కూడా క్రేజీ ..

Rajini-Kamal: అనిరుథ్‌ను పక్కకునెట్టిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. బన్నీ, రజినీ సినిమాల్లో ఆఫర్లు
Kamal Rajini N Anirudh

Updated on: Dec 05, 2025 | 7:43 AM

సౌత్ ఇండియాలో చిత్ర విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాలోని పాటలే కాదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉండాలి. ముఖ్యంగా హీరో ఎలివేషన్, ఎంట్రన్స్.. మ్యూజిక్ డైరెక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇటు తెలుగు అటు తమిళంలో కూడా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఉన్నాడు అనిరుథ్ రవిచంద్రన్.

ఇప్పుడు ఆ సంగీత రంగంలో కొత్త తరంగం రాబోతోంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే యూట్యూబ్ నుంచి కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తున్నాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టును ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్‌ను “తలైవా” అని పిలుస్తూ అభిమానులు ఆరాధిస్తారు. ఆ తలైవా సినిమాకు సంగీతం అందించే అదృష్టం ఇప్పుడు సాయి అభ్యంకర్‌దే కాబోతోందని తెలుస్తోంది.

సాయి ప్రయాణం చాలా సాధారణంగా మొదలైంది. ఒక ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ కావడంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న AA22  చిత్రం సంగీత బాధ్యతలు చేపట్టి ట్రెండింగ్ అయ్యాడు సాయి. ఇటీవల విడుదలైన డ్యూడ్ సినిమాతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

Rajni Kamal And Sai

ఇప్పుడు చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బలమైన బజ్ ఏమిటంటే… కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ చేశారట! ముందుగా ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వం వహించాల్సి ఉండగా, డేట్స్ సమస్య కారణంగా ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

దీని గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ప్రొడక్షన్ టీమ్ వేచి చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ సాయి అభ్యంకర్ కెరీర్‌కు భారీ లాంచ్ ప్యాడ్‌గా మారబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కనగరాజ్ బ్యానర్‌లో బెంజీ, కార్తి మార్షల్, సూర్య కరుప్పు వంటి చిత్రాలతో పాటు అల్లు అర్జున్ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు అభ్యంకర్.

అనిరుధ్ ఆధిపత్యం కొంచెం తగ్గిన ఈ సమయంలో… సాయి అభ్యంకర్ వంటి యంగ్ టాలెంట్ రాకతో తమిళ్, తెలుగు సినీ సంగీతంలో కొత్త ఊపిరి పోసుకుంటుందని అంటున్నారు. తలైవాతో ఈ కలయిక… ఖచ్చితంగా సంచలనం సృష్టించబోతోంది!