బాలీవుడ్ టాప్ హీరోకు ఎన్‏సీబీ నోటిసులు.. డ్రగ్ డీలర్స్‏తో సంబంధాలున్నాయనే ఆరోపణలు..

|

Dec 15, 2020 | 9:10 PM

బాలీవుడ్‏లో డ్రగ్స్ కేసు ఓ కొలక్కి రావడం లేదు. ఇప్పటికే ఇందులో సంబంధాలు ఉన్నాయంటూ పలువురు టాప్ హీరోహీరోయిన్లను ఎన్‏సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ టాప్ హీరోకు ఎన్‏సీబీ నోటిసులు.. డ్రగ్ డీలర్స్‏తో సంబంధాలున్నాయనే ఆరోపణలు..
Follow us on

బాలీవుడ్‏లో డ్రగ్స్ కేసు ఓ కొలక్కి రావడం లేదు. ఇప్పటికే ఇందులో సంబంధాలు ఉన్నాయంటూ పలువురు టాప్ హీరోహీరోయిన్లను ఎన్‏సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ హీరో అర్జున్ రాంపాల్‏కు మరోసారి ఎన్‏సీబీ అధికారులు నోటిసులు జారీ చేశారు. పలువురు డ్రగ్ డీలర్స్‏తో అర్జున రాంపాల్‏కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గత నవంబర్‏లో ఎన్‏సీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్‏ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్ రాంపాల్ మళ్లీ మరోసారి విచారణకు రావాలని ఆదేశిస్తూ మంగళవారం నోటీసులు పంపింది. డిసెంబర్ 16న ఎన్‏సీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపింది. కాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుతో డ్రగ్స్ కేసులపై ఎన్‏సీబీ దర్యాప్తు చేపడుతున్న సంగతి తెలిసిందే.