Nedumudi Venu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నెడుముడి వేణు మరణం.

| Edited By: Ravi Kiran

Oct 11, 2021 | 7:27 PM

Nedumudi Venu: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాల నటులు, నేషనల్‌ అవార్డు విన్నర్‌ నెడుముడి వేణు సోమవారం మరణించారు. 73 ఏళ్ల వేణు గత కొన్ని రోజులుగా తిరువనంత పురంలోని..

Nedumudi Venu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నెడుముడి వేణు మరణం.
Follow us on

Nedumudi Venu: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాల నటులు, నేషనల్‌ అవార్డు విన్నర్‌ నెడుముడి వేణు సోమవారం మరణించారు. 73 ఏళ్ల వేణు గత కొన్ని రోజులుగా తిరువనంత పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్‌ సంబంధిత వ్యాధి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పూర్తిగా ఆరోగ్యం క్షీణించిడంతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

నెడుముడి వేణు కెరీర్‌ విషయానికొస్తే ఈయన తన నటనా ప్రస్థానాన్ని చిన్న థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. ఇక 1978లో జీ అరవిందన్‌ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో వేణు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500 సినిమాల్లో నటించారు. తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన తన అద్భుత నటనతో మూడు నేషనల్‌ అవార్డ్స్‌తో పాటు 7 రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నారు. నెడుముడి మరణ వార్తపై తోటి సినీ తారలు సంతాపం తెలుపుతున్నారు. మలయాళం, తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరు సోషల్‌ మీడియా వేదికగా నెడుముడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Also Read: Maa Elections 2021: ప్రకాశ్‌ రాజ్‌ ‘మా’ రాజీనామాపై స్పందించిన విష్ణు.. ఈ విషయంపై మాట్లాడుదామంటూ..

Mysore Tourism Places: ప్రకృతి ప్రేమికులకు స్వర్గదామం.. భారత రాజసానికి చిరునామా.. మైసూరులో చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

Union Bank: యూనియన్ బ్యాంకర్ సర్క్యూలర్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు.. దెబ్బకు దిగొచ్చిన యాజమాన్యం..