Ante Sundaraniki: సెట్‌లోనే ఈ రేంజ్‌లో నవ్వులుంటే.. థియేటర్లలో చక్కిలిగింతలే.. ఆకట్టుకుంటోన్న వీడియో..

Ante Sundaraniki: న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) హీరోగా నజ్రియా ఫహద్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'అంటే సుందరానికి'. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది...

Ante Sundaraniki: సెట్‌లోనే ఈ రేంజ్‌లో నవ్వులుంటే.. థియేటర్లలో చక్కిలిగింతలే.. ఆకట్టుకుంటోన్న వీడియో..
Ante Sundaraniki

Updated on: May 27, 2022 | 6:15 AM

Ante Sundaraniki: న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) హీరోగా నజ్రియా ఫహద్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జూన్‌ 10న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే ఇప్పటికే నాని, నజ్రియాలు కలిసి ఫన్నీ చిట్ చాట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మరో ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది.

సినిమా షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో సెట్స్‌లో చోటుచేసుకున్న ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వాటినన్నింటినీ ఒకచోట చేర్చి ఈ వీడియోను రూపొందించారు. షూటింగ్‌ సమయంలో చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెన్స్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే ఈ స్థాయిలో నవ్వులు పూయిస్తే ఇక థియేటర్లలో ప్రేక్షకులకు చక్కిలిగింతలే అని చెప్పకనే చెప్పింది చిత్రయూనిట్‌. పూర్తా స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా థియేటర్లలో నవ్వులతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందేమో చూడాలి. మరి నవ్వులు పూయిస్తున్న అంటే సుందరానికి మేకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి…