Krishna Birthday: కృష్ణ బర్త్‌డే రోజు నమ్రతా ఎమోషనల్ పోస్ట్‌.. తండ్రి స్థానంలో ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ..

| Edited By: Ravi Kiran

May 31, 2022 | 7:42 PM

Krishna Birthday: టాలీవుడ్‌, ఆమాటకొస్తే ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో కృష్ణ ఒకరు. జేమ్స్‌బాండ్‌, కౌబాయ్‌ లాంటి పాత్రలను తొలిసారి తెలుగు తెరకు పరిచయం చేసి...

Krishna Birthday: కృష్ణ బర్త్‌డే రోజు నమ్రతా ఎమోషనల్ పోస్ట్‌.. తండ్రి స్థానంలో ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ..
Follow us on

Krishna Birthday: టాలీవుడ్‌, ఆమాటకొస్తే ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో కృష్ణ ఒకరు. జేమ్స్‌బాండ్‌, కౌబాయ్‌ లాంటి పాత్రలను తొలిసారి తెలుగు తెరకు పరిచయం చేసి చెరగని సంతకం చేశారు కృష్ణ. ఏడాదిలో ఏకంగా అరడజనకుపైగా సినిమాలు విడుదల చేసి సత్తా చాటారు. హీరోగా, ప్రొడ్యుసర్‌గా తెలుగు వెండి తెరపై తనదైన ముద్ర వేసిన కృష్ణ పుట్టిన రోజు నేడు. 79 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం 80వ వపంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు కుటంబ సభ్యులు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెబుతున్నారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్స్‌ మహేష్‌ బాబు తన తండ్రి ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటూ పోస్ట్ చేశారు. ఇక మహేష్‌ భార్య, కృష్ణ కోడలు నమ్రతా కూడా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కూతురు సితారా, కొడుకు గౌతమ్‌తో కృష్ణ కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసిన నమ్రతా.. ‘ఎన్నో ఏళ్ల నుంచి మీతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, ఆనందాన్ని తీసుకొచ్చారు. ఈ విషయంలో నేను మీకెప్పుడు కృతజ్ఞురాలినై ఉంటాను. నా భర్తకు, నాకు, మా పిల్లలందరికీ తండ్రి స్థానంలో ఉన్నందుకు ధన్యవాదాలు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మామయ్య’ అంటూ ఎమోషన్‌ నోట్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం నమ్రతా పోస్ట్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..