షూటింగ్ ప్రారంభించేసిన నాగార్జున

షూటింగ్‌లకు సడలింపులు ఇచ్చినప్పటికీ.. సినీ ప్రముఖులు మాత్రం సెట్స్ మీదికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఇంకా జరుగుతుండటంతో.. వారు ఇళ్లకే పరిమితం అయ్యారు.

  • Tv9 Telugu
  • Publish Date - 12:56 pm, Tue, 28 July 20
షూటింగ్ ప్రారంభించేసిన నాగార్జున

Akkineni Nagarjuna starts Shooting: షూటింగ్‌లకు సడలింపులు ఇచ్చినప్పటికీ.. సినీ ప్రముఖులు మాత్రం సెట్స్ మీదికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఇంకా జరుగుతుండటంతో.. వారు ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన సీనియర్ హీరోలు షూటింగ్‌లకు రాలేమని చెప్పేశారట. అలాగే యంగ్ హీరోలు సైతం కుటుంబాలకు ఇబ్బంది కలిగించలేమని, నిదానంగానే షూటింగ్‌లను ప్రారంభిద్దామని దర్శకులకు క్లారిటీ ఇచ్చేశారట. ఈ నేపథ్యంలో సినిమాలు సెట్స్ మీదకు వెళ్లేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టనుంది.

అయితే ఇలాంటి సమయంలోనూ షూటింగ్‌ని ప్రారంభించేశారట నాగార్జున. అయితే సినిమా కోసం కాదు. బుల్లితెరపై విజయవంతమైన బిగ్‌బాస్ నాలుగో సీజన్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆగష్టు మధ్యలో నుంచి ఈ షోను ప్రసారం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఇక ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న నాగార్జున.. ప్రోమోకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ ప్రోమోను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా కరోనా నేపథ్యంలో ఈ సారి తక్కువ రోజులే బిగ్‌బాస్ వినోదం ఉండబోతున్నట్లు సమాచారం. ఇక 13 మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో భాగం అవ్వబోతుండగా.. వైల్డ్‌ కార్డ్ ఎంట్రీ ఉండదని టాక్‌. హౌజ్‌లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికీ అన్ని టెస్ట్‌లు చేసి, ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణకు వచ్చిన తరువాతే బిగ్‌బాస్‌ని ప్రారంభించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

Read This Story Also: పెరుగుతోన్న ఊబకాయం.. ‘బై వన్ గెట్‌ వన్’‌కి బ్రేక్‌