పవన్‌-బాలయ్య ఫొటో షేర్ చేసిన నాగబాబు.. ఆసక్తికర కామెంట్‌

| Edited By:

Sep 14, 2020 | 4:25 PM

మెగా బ్రదర్ నాగబాబు సోషల్‌ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. అరుదైన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు

పవన్‌-బాలయ్య ఫొటో షేర్ చేసిన నాగబాబు.. ఆసక్తికర కామెంట్‌
Follow us on

Pawan- Balayya photo: మెగా బ్రదర్ నాగబాబు సోషల్‌ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. అరుదైన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్‌-బాలకృష్ణ ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫొటోను నాగబాబు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోకు.. ”ఇద్దరు సోదరులు కలిసిన వేళ. ఒకరు నా సొంత సోదరుడు. మరొకరు నాకు లభించిన సోదరుడు. పవర్‌స్టార్ నందమూరి సింహాన్ని కలిసిన రోజు” అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఇదే ఫొటోకు మేము సినిమాను ప్రేమిస్తాము. ఆ తరువాతే ఏదైనా అని మరో కామెంట్‌ని యాడ్ చేశారు. ఇక ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండగా.. అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ పాజిటవ్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే 2019 ఎన్నికలకు ముందు నుంచే నాగబాబు, బాలయ్యను పలుమార్లు టార్గెట్ చేశారు. ఆయనెవరో తెలీదని కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన యూట్యూబ్ ఛానెల్‌లో సైతం బాలయ్యపై నాగబాబు పలు కామెంట్లు చేశారు. అలాంటిది ఉన్నట్లుండి సోదరుడు అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Read More:

బాలయ్య సినిమాలో అల్లరి నరేష్..!

ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం