టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాతో కె.పి.రాజేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నాగశౌర్య కెరీర్లో 23వ సినిమా ఇది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శుక్రవారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఇక దీనికి ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తర్వలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
A new story begins!
Here’s revealing the title and logo of @IamNagashaurya’s #PoliceVaariHecharika.
Get ready for an amazing experience.Directed by K P Rajendra @rajendrakolusu
Produced By @smkoneru @eastcoastprdns #NS23#HappyBirthdayNagaShaurya pic.twitter.com/c2DxMxz8Uf— BARaju (@baraju_SuperHit) January 21, 2021
Also Read:
స్టార్ హీరో సినిమాలో నటించనున్న నాని హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా రానున్న చెన్నై బ్యూటీ ?