Naga Shaurya: నాగ శౌర్య ఫార్మ్‌హౌస్ పేకాట కేసు.. రూ.6.7లక్షలు, మూడు కార్లు స్వాధీనం..FIR కాపీ.. వివరాల్లోకి వెళ్తే..

|

Nov 01, 2021 | 4:42 PM

Naga Shaurya Farm House Case: ఆదివారం రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల విలేజ్ లో ఫార్మ్ హౌజ్ లో పేకాట స్థావరం పై ముగ్గురు..

Naga Shaurya: నాగ శౌర్య ఫార్మ్‌హౌస్ పేకాట కేసు.. రూ.6.7లక్షలు, మూడు కార్లు స్వాధీనం..FIR కాపీ.. వివరాల్లోకి వెళ్తే..
Naga Shaurya Father Farmhou
Follow us on

Naga Shaurya Farm House Case: ఆదివారం రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల విలేజ్ లో ఫార్మ్ హౌజ్ లో పేకాట స్థావరం పై ముగ్గురు ఎస్ఐ లు దాడి చేశారు. ఈ దాడిలో 4 టేబుల్లో నగదు పెట్టి జూదం ఆడుతున్నారు. మణికొండకు చెందిన గుత్తా సుమన్ కుమార్ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తూ.. మిగిలిన 29 మందిని సుమన్ రప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు పేకాట స్థావరం పై దాడి చేశారు. సుమోట కింద కేస్ చేసిన నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న కొంతమందిని అరెస్ట్ చేశారు.

అంతేకాదు రూ 6,77,250 నగదు సీజ్ చేశారు.  31 సెల్ ఫోన్ లు, ఒక స్వైపింగ్ మిషన్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరం వద్ద ఉన్న 30 మంది పై టి ఎస్ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సి.అర్.పి.సి 154, 157 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయ్యిన వారిలో మారేడు తనును, గుమ్మడి రామస్వామి చౌదరి,  నాందిగ ఉదయ్,  శ్రీనివాస్ రావ్, శివ రామకృష్ణ , బడిగా సుబ్రమణ్యం , సురేష్, నాగార్జున, వంకటేష్, వెంకట రమణ రావ్, మిర్యల భాను ప్రకాష్, తిరుమల రావ్, వీర్ల శ్రీకాంత్, మద్దుల ప్రకాష్, రాజ రామ్, మల్లికార్జున్ రెడ్డి,నాగరాజు, గట్ట వెంకటేష్, ఎస్ ఎస్ ఎన్ రాజు, గోపాల్ రావ్, రమేష్, రోహిత్, ఆదిత్య, గణేష్,శ్రీరామ్ భద్రయ్య, తోటా ఆనంద్ కిషోర్, షేక్ ఖదీర్, రాజేశ్వర్ తదితరులున్నారు.

Also Read:   చిన్న పిల్లల్లో నులిపురుగుల సమస్యకు చక్కటి సహజమైన ఔషధం ఈ మొక్క..