Naga Chaintanya: చాన్నాళ్లకు సామ్‌తో కలిసి ఉన్న అందమైన పిక్ షేర్ చేసిన చైయ్..

‘ఏమాయ చేసావె’లో సామ్‌ జెస్సీ పాత్రలో నటించి మెప్పించారు. నాగచైతన్య హీరో. ఫీల్‌ గుడ్‌ ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు గౌతమ్ మీనన్.

Naga Chaintanya: చాన్నాళ్లకు సామ్‌తో కలిసి ఉన్న అందమైన పిక్ షేర్ చేసిన చైయ్..
Naga Chaitanya - Samantha

Updated on: Feb 27, 2023 | 9:17 PM

ఫిబ్రవరి 26వ తేదీ మూవీ లవర్స్‌కు ఎంతో స్పెషల్. తెలుగు సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావే’  ఆ రోజునే రిలీజైయ్యింది. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈసినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26తో ఆ మూవీ రిలీజై 13 ఏళ్లు కంప్లీట్ అయ్యింది. ఇందులో సామ్, చెయ్ కెమిస్ట్రీ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోతుంది. ప్రేమ కథల్లో దీన్నో కల్ట్ క్లాసిక్‌‌గా చెబుతారు ఫిల్మ్ క్రిటిక్స్. గౌతమ్ మీనన్ మేకింగ్‌ను ఇప్పటికీ ప్రశంసిస్తూ ఉంటారు. సినిమా 13వ వార్షికోత్సవం సందర్భంగ అటు సమంత, ఇటు నాగచైతన్య ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా..  సినిమా గురించి తమ మధుర అనుభవాలను పంచుకున్నారు.

నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సినిమాలో హీరోయిన్‌గా నటించిన తన మాజీ భార్య సమంతతో కలిసి ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. అయితే సమంత మాత్రం 13 ఏళ్ల మార్క్‌కు చేరుకున్న తన కెరీర్ గురించి సోషల్ మీడియా కథనాలలో మాత్రమే ప్రస్తావించింది. అంతేకానీ నాగ చైతన్యతో కలిసి ఉన్న మూవీ ఫోటోలు షేర్ చేయలేదు. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన చైయ్-సామ్ జోడీ.. 2017లో మ్యారేజ్ చేసుకుంది. అనుకోని కారణాల వల్ల 2021లో వీరు డివోర్స్ తీసుకున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే..  ‘మయోసైటిస్‌’ కారణంగా ‘యశోద’ తర్వాత కొంత బ్రేక్‌ తీసుకున్న  సమంత.. రాజ్‌ అండ్‌ డీకే డైరెక్షన్‌లో వస్తున్న వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది.  నాగ చైతన్య..  వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ని  కంప్లీట్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.