AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 14 మంది స్కూల్ పిల్లల మరణం.. OTT టాప్ ట్రెండింగ్‌లో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

రెండు రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను జనాలు తెగ చూసేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండడంతో రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ తో ఇప్పుడీ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: 14 మంది స్కూల్ పిల్లల మరణం.. OTT టాప్ ట్రెండింగ్‌లో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 11, 2026 | 5:58 PM

Share

ప్రస్తుతం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఎపిక్.. ది ఫస్ట్ సెమిస్టర్, మారెమ్మ వంటి తెలుగు సినిమాలతో పాటు ఖలీఫా, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, ఆశా వంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ఆడియెన్స్ కు మంచి వినోదం అందిస్తున్నాయి. అయితే వీటితో పాటే వచ్చిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కావడం, తెలుగుతో పాటు వివిధ భాషల్లోకి అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ వస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్ట్రింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇసుక మాఫియాకు సంబంధించి నిజాలను వెలికితీసే ఓ యంగ్ జర్నలిస్ట్ చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఓ ప్రముఖ టీవీ నెట్ వర్క్ ఛానెల్ లో రిపోర్టర్‌గా వర్క్ చేస్తుంటుంది సంధ్య . కెమెరా మెన్ వినోద్ ఆమెకు సాయంగా ఉంటాడు. నగరంలో ఓసారి ఓ పెద్ద వంతెన కూలి 14 మంది స్కూల్ చిన్నారులతో పాటు ఓ గర్భిణీ సైతం మృతి చెందుతుంది. ఇది కవర్ చేయడానికి వెళ్లిన వీరిద్దరూ మొదట ఇది సాధారణ ప్రమాదమే అని భావించారు. అయితే ఆ తర్వాత ఈ ప్రమాదం వెనుక భారీగా ఇసుక మాఫియా, రాజకీయ ఒత్తిళ్లు, ఎన్నో అక్రమాలు జరిగాయని తెలుస్తుంది.

దీంతో వంతెన ప్రమాదానికి కారణమైన అసలు నేరస్తులను పట్టుకునేందుకు సంధ్య, వినోద్ ఇద్దరూ కలిసి సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తారు. అయితే ఈ క్రమంలో వారికి సొంత ఛానల్ నుంచే ఇద్దరికీ ఒత్తిళ్లు ఎదురవుతాయి. మరి సంధ్య ప్రయత్నం ఫలించిందా? ఇసుకాసురులను పట్టుకుందా? లేదా? ఈ క్రమంలో వారికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు రిపోర్టింగ్ లైవ్. బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా (సంధ్య), దేవేన్ భోజానీ (వినోద్) ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు అమోల్ పాలేకర్, ఆదిల్ హుస్సేన్, నాజర్, శేఖర్ సుమన్, శాశ్వత్ ఛటర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ధ్రువ్ త్రిపాఠి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పార్థ కిరణ్ ఠాకూర్, జాషువా షిర్సాత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం రిపోర్టింగ్ లైవ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ హిందీ వెర్షన్ తో పాటు తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

రిపోర్టింగ్ లైవ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ
14 మంది పిల్లల మరణం.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు
14 మంది పిల్లల మరణం.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు