VanaVeera Film Review: వనవీర సినిమా రివ్యూ.. ఇది మన ఊరి రాజకీయం..!

కులం కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దానికి రాజకీయం కూడా తోడైతే అది సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుంది. తాజాగా వాన వీర అనే సినిమా అదే కాన్సెప్ట్ తో వచ్చింది. ఒకవైపు కులం.. మరోవైపు రాజకీయం కలుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

VanaVeera Film Review: వనవీర సినిమా రివ్యూ.. ఇది మన ఊరి రాజకీయం..!
Vana Veera

Edited By:

Updated on: Jan 01, 2026 | 5:12 PM

మూవీ రివ్యూ: వనవీర

నటీనటులు: అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, శ్రీ నందు, కోన వెంకట్, సత్య, శివాజీ రాజా, ఆమని తదితరులు..

సంగీతం: వివేక్ సాగర్

ఇవి కూడా చదవండి

ఎడిటింగ్: చోటా కె ప్రసాద్

నిర్మాతలు: అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి

దర్శకత్వం: అవినాష్ తిరువీధుల

కులం కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దానికి రాజకీయం కూడా తోడైతే అది సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుంది. తాజాగా వాన వీర అనే సినిమా అదే కాన్సెప్ట్ తో వచ్చింది. ఒకవైపు కులం.. మరోవైపు రాజకీయం కలుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

కథ:

గోదావరి జిల్లాలోని వారాపురంలో రఘు (అవినాష్) కుటుంబంలో పాటు కలిసి ఉంటాడు. తక్కువ కులంలో పుట్టడంతో వాళ్లను తక్కువగా చూస్తుంటారు రాజకీయ నాయకులు. ఒక సామాన్యుడిలా బతుకుతుంటాడు. అయితే ఊరిలో ఎలక్షన్స్ హడావిడి మొదలైనప్పుడు.. మోడ్రన్ రావణుడిగా భావించే విలన్ దేవ (నందు) రాజకీయ ర్యాలీ కోసం రఘుకు అత్యంత ఇష్టమైన బైక్‌ను తీసుకుంటారు. ఆ బైక్ కోసం హీరో చేసే పోరాటం, దానికి రామాయణ గాథకు ఉన్న లింక్ ఏంటి..? చివరకు హీరో తన ఆత్మ గౌరవాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు..? అనేదే ఈ సినిమా కథ.

కథనం:

మనం ఏ సినిమా చేసినా కూడా అందులో కథ రామాయణం, మహాభారతాలను టచ్ చేయకుండా ఉండదు. మన ఇతిహాసాలకు ఉన్న గొప్పతనం అలాంటిది. ఇప్పుడు వానవీర సినిమాలో కూడా దర్శకుడు కం హీరో అవినాష్ తీరువీధుల ఇదే చేశాడు. సాధారణ పల్లెటూరి రాజకీయాలకు, పురాణాల టచ్ ఇవ్వడం ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా మొదటినుంచి ఇటు రాజకీయాల మాట తన కథను ముడి పెడుతూ వచ్చాడు దర్శకుడు. దాంతోపాటు ఎక్కువసార్లు కులం టాపిక్ తీసుకొచ్చాడు. ఊర్లో అగ్రకులం వాళ్ళు కింద కులం వాళ్ళని ఎలా చూస్తారు అనేది ఇందులో కాస్త లోతుగా చూపించే ప్రయత్నం చేశాడు. కథ కొత్తదేమీ కాదు.. ఉన్న కథను రామాయణానికి లింకు పెట్టి చూపించాలనే ప్రయత్నం చేశాడు. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెనక హనుమంతుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా చేశాడు హీరో కం అవినాష్. ఫస్టాఫ్ వరకు ఏదో సాదాసీదాగా వెళ్ళిపోతుంది. మధ్యమధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బాగానే వాడుకున్నాడు.

మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ట్విస్టులు, ఒక స్పెషల్ క్యామియో సినిమా స్థాయిని పెంచాయి. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. పూర్తి స్థాయి కమర్షియల్ హంగులు ఆశించే వారికి కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపించవచ్చు. క్లైమాక్స్ పర్లేదు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, వానర సైన్యం, వారధి కట్టే విజువల్స్ చాలా బాగున్నాయి. ఇవి సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. వనవీర ఒక వైవిధ్యమైన ప్రయత్నం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మైథలాజికల్ టచ్‌తో వచ్చిన ఈ విలేజ్ డ్రామా ప్రేక్షకులను పర్లేదు అనిపిస్తుంది. చిన్న సినిమా అయినా, కంటెంట్, మేకింగ్ పరంగా పెద్ద సినిమా స్థాయిని చూపిస్తుంది.

నటీనటులు:

హీరోగా, దర్శకుడిగా అవినాష్ తిరువీధుల మంచి ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించారు. విలన్‌గా నందు నటన ఆకట్టుకుంటుంది. సిమ్రాన్ చౌదరి పర్లేదు. మరో కీలక పాత్రలో శివాజీ రాజా బాగానే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటుడు టార్జాన్ ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించాడు. చివర్లో వచ్చే సత్య క్యామియో బాగుంది. మిగిలిన వాళ్ళందరూ ఓకే..

టెక్నికల్ టీం:

వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. పల్లెటూరి అందాలను, యాక్షన్ ఎపిసోడ్స్‌ను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. అవినాష్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని తెరపై చూపించడంలో పర్లేదు అనిపించాడు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్ గా వన వీర.. విలేజ్ పాలిటిక్స్ విత్ మైథాలజీ..!