
మూవీ రివ్యూ: కాంతార చాప్టర్ 1
నటీనటులు: రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం తదితరులు
ఎడిటర్: సురేష్ మల్లయ్య
సినిమాటోగ్రాఫర్: అరవింద్ ఎస్. కశ్యప్
సంగీతం: అజినీష్ లోకనాథ్
నిర్మాత: విజయ్ కిరగందూర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రిషబ్ శెట్టి
కథ:
కొన్ని వందల సంవత్సరాల క్రితం కడంబ రాజవంశ కాలంలో బనవాసి అడవుల్లో జరిగే జానపద కథ ఇది. కాంతారా అడవుల్లో ఆర్థిక రక్షకుడిగా ఉంటాడు బెర్మి (రిషబ్ శెట్టి). అతడి పుట్టుకలోనే ఒక దైవ రహస్యం ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కష్టం వచ్చినా శివగనాలు వచ్చే రక్షిస్తూ ఉంటాయి. ఆ గూడెం వాళ్ళు నిత్యం మహాశివుడి ఆరాధన చేస్తూ ఉంటారు. మరోవైపు ఎలాగైనా కాంతారాలో ఉన్న దేవుడి విగ్రహాన్ని తమ సొంతం చేసుకోవాలని బాంగ్ర రాజ్యం వాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మహారాజు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) కాంతారా వాళ్ల మీదకి యుద్ధం ప్రకటిస్తాడు. ఇక అదే రాజ్యం యువరాణి అయిన కనకావతి (రుక్మిణీ వసంత్), ఆమె తండ్రి మహారాజు రాజశేఖరుడు (జయరామ్) మాత్రం కాంతారా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఒక విగ్రహం విషయంలో మరో తెగ కూడా కాంతారా మీదకు యుద్ధానికి వస్తుంది. అసలు ఆ దేవుడి విగ్రహం వాళ్ళు చేజిక్కించుకున్నారా లేదంటే కాంతారా వాళ్ల దగ్గరే ఉండిపోయిందా.. దాన్ని కాపాడడానికి ఆ మహా శివుడు వచ్చాడా లేదా అనేది అసలు కథ..
కథనం:
ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏం చేసినా బాగానే ఉంటుంది.. అదే అంచనాలున్నప్పుడు అద్భుతం జరగడానికి ఆకాశాన్ని అందుకోవాలి. కాంతారా చాప్టర్ 1 విషయంలో రిషబ్ శెట్టి చేసింది ఇదే. అంచనాల ఆకాశానికి నిచ్చెన వేయడానికి ప్రయత్నించాడు. నిజం చెప్పాలంటే.. కాంతారా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ మాత్రం ఇప్పుడు రాదు. అంతా బాగానే ఉన్నా ఎక్కడ ఒక వెలితి మాత్రం మిగిలిపోయింది. ఫస్టాఫ్ చూసిన తర్వాత ఎందుకు కాంతారా లాంటి సబ్జెక్టు రిషబ్ మళ్లీ ముట్టుకున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అందుకే అది ఒక అద్భుతంలా కనిపించింది. సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి బడ్జెట్ పెరిగింది.. ఆ రియల్ ఫీలింగ్ ఎందుకో తగ్గిపోయింది. ఆర్టిఫిషియల్ గా కథ ముందుకు వెళ్తున్నట్టు అనిపించింది. కొన్ని సీన్లు అవసరం లేదేమో..! కానీ సెకండ్ హాఫ్ డీసెంట్ గా రాసుకున్నాడు. కాంతారా ప్రజలు తమ ఉనికి కోసం, దేవుడి కోసం ఎలాంటి పోరాటం చేశారు అనేది ఈ సినిమా కథ. సెకండ్ హాఫ్ లో దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు కమ్ నటుడు రిషబ్ శెట్టి. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా కుదిరాయి. హీరో శరీరంలోకి కాంతారా వచ్చినప్పుడు ఉండే సన్నివేశాలు మరోసారి గూస్ బంప్స్. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రాణం.. సేమ్ కాంతారా మాదిరే ఇందులో కూడా అదిరిపోయే క్లైమాక్స్ రాసుకున్నాడు రిషబ్. ఫస్ట్ హాఫ్‌లో నేరేషన్ నెమ్మదిగా సాగుతుంది. బనవాసి అడవులు, గుహలు, రాజవంశ బ్యాక్‌డ్రాప్‌ను సెట్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. ఇంటర్వెల్ నుంచి కథనం ఊపందుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో వార్ సీక్వెన్స్‌లు, దేవుడి కనెక్షన్‌లు గూస్‌బంప్స్ బాగున్నాయి.
నటీనటులు:
రిషబ్ శెట్టి మరోసారి అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అద్భుతంగా నటించాడు. రుక్మిణి వసంత్ కూడా కీలకమైన పాత్రలో మెప్పించింది. గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ వెరైటీగా ఉంది. మహారాజు పాత్రలో జయరాం కూడా బాగున్నాడు. మిగిలిన వాళ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
అజినీష్ లోక్నాథ్ మరోసారి తన మ్యూజిక్ తో సినిమాను నిలబెట్టాడు. ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు తీసి ఉంటే బాగుండేది. కానీ డైరెక్టర్ డిసిషన్ కాబట్టి ఆయనను తప్పు పట్టలేము. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫస్ట్ పార్ట్ రేంజ్ లో మెప్పించలేదేమో అనిపించింది…ఇది కూడా బాగానే ఉంది కానీ ఎక్కడో ఆ ఫ్రెష్ ఫీల్ మిస్ అయింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్ గా కాంతారా చాప్టర్ 1.. అంచనాలు లేకుండా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు..!