Hero Movie Review: హీరో మూవీ రివ్యూ.. ప్రతి సీనులోనూ ‘హీరో’ ఎలివేషనే!

|

Jan 15, 2022 | 1:52 PM

ఇండస్ట్రీతో ఏ మాత్రం పరిచయం లేని ఓ హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంటే పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు. కానీ, సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు,

Hero Movie Review: హీరో మూవీ రివ్యూ.. ప్రతి సీనులోనూ హీరో ఎలివేషనే!
Hero
Follow us on

ఇండస్ట్రీతో ఏ మాత్రం పరిచయం లేని ఓ హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంటే పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు. కానీ, సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్‌ మేనల్లుడు అనే ట్యాగ్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం కచ్చితంగా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఇంతకీ గల్లా అశోక్‌ ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్‌ అయ్యారా? హీరో ఎలా ఉంది? చదివేయండి…

సినిమా: హీరో
నటీనటులు: అశోక్‌ గల్లా, నిధి అగర్వాల్‌, జగపతి బాబు, నరేష్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, సత్య తదితరులు
‘స్టోరీ – స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
నిర్మాత: పద్మావతి గల్లా
సంగీతం: గిబ్రన్‌
కెమెరా: సమీర్‌ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్‌
ఆర్ట్: ఎ.రామాంజనేయులు
ఎడిటర్‌: ప్రవీణ్‌పూడి
విడుదల: జనవరి 15, 2022

ఎలాగైనా సినిమాలో హీరో కావాలనుకునే కుర్రాడు అర్జున్‌ (అశోక్‌ గల్లా). అతని నైబర్‌ కమ్‌ గర్ల్ ఫ్రెండ్‌ సుబ్బు (నిధి అగర్వాల్‌). అర్జున్‌ తండ్రి వెటర్నరీ డాక్టర్‌ (నరేష్‌). అతని దగ్గర పనిచేస్తుంటుంది సుబ్బు. అనుకోకుండా ఓ సందర్భంలో సుబ్బు తండ్రిని కలుస్తాడు అర్జున్‌. వాళ్లిద్దరికీ ఫస్ట్ మీటింగ్‌ నుంచే పడదు. అయినా అతన్ని ఓ ఆపద నుంచి కాపాడుతుంటాడు అర్జున్‌. అర్జున్‌ పేరుతో ఉన్న ఆ ఇంకో వ్యక్తి ఎవరు? అతనికి సుబ్బు ఫాదర్‌కి ఉన్న గొడవలేంటి? సుబ్బు తండ్రి ఫ్లాష్‌బ్యాక్‌లో డానా? అర్జున్‌ సమస్యలు తెలుసుకుని అతని తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడు? మధ్యలో ముంబై భాయ్‌ ఎవరు? వంటివన్నీ సెకండ్‌ హాఫ్‌లో తెలిసే విషయాలు.

గల్లా అశోక్‌ న్యూ కమర్‌ అయినా ఎక్కడా బెరుకు లేకుండా యాక్ట్ చేశారు. కెమెరా ఫ్రెండ్లీగా ఉన్నాయి అతని ఎక్స్ ప్రెషన్స్. డ్యాన్సులు కూడా బావున్నాయి. నిధి అగర్వాల్‌ తన కేరక్టర్‌కి తగ్గట్టు కనిపించారు. జగపతిబాబుకు ఇది కొత్త తరహా పాత్ర. ఆయన కేరక్టర్‌లో ట్విస్ట్ కూడా బావుంది. నరేష్‌కి కూడా మంచి కేరక్టర్‌ కుదిరింది. కొండపొలం తర్వాత కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించారు.

జిబ్రన్‌ సంగీతం బావుంది. పాటలకన్నా రీరికార్డింగ్‌ సన్నివేశాలకు తగ్గట్టు ఉంది.
సూపర్‌స్టార్‌ కృష్ణ కౌబోయ్‌ గెటప్‌ని స్క్రీన్‌ మీద చూపించినప్పుడు ఘట్టమనేని అభిమానుల జోష్‌కి అంతే లేదు. అలాగే రెట్రో సాంగ్‌లో సూపర్‌స్టార్‌ విజువల్స్ ని మిక్స్ చేసిన తీరు బావుంది.
కథ వింటూ హీరో పోకిరి షాట్స్ గుర్తు చేసుకోవడం కూడా ఫ్యాన్స్ ని మెప్పించే షాట్స్.
చిరంజీవితో పాటు మిగిలిన ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం కూడా కనిపించింది స్క్రీన్‌ మీద.
క్లైమాక్స్ లో సినిమా వాళ్ల గురించి చెప్పే డైలాగులు కనెక్ట్‌ అవుతాయి.
ఫక్తు శ్రీరామ్‌ ఆదిత్య స్క్రీన్‌ప్లే కనిపిస్తుంది సినిమాలో. కొన్ని సన్నివేశాలను రిపీట్‌ చేయకుండా ఉండాల్సింది.
ఫస్ట్ హాఫ్‌లో ఇంకాస్త షార్ప్ ఎడిటింగ్‌ చేయాల్సింది. లాజిక్కులు వెతక్కుండా సినిమాటిక్‌ లిబర్టీస్‌ని ఎంజాయ్‌ చేస్తే సరదాగా అనిపిస్తుంది.

అశోక్‌ గల్లాని ఇంట్రడ్యూస్‌ చేస్తున్న సినిమా కావడంతో డబ్బు బాగా ఖర్చుపెట్టారు. పెద్ద సెట్లు, బోలెడంతమంది డ్యాన్సర్లు, జూనియర్‌ ఆర్టిస్టులతో సాంగ్స్, సీన్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. టైమ్‌ పాస్ కి సరదాగా చూసేయొచ్చు ‘హీరో’ని.
– డా. చల్లా భాగ్యలక్ష్మి

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Mr.Pregnant Movie: మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..