Harnaaz Kaur Sandhu: జవాన్ల కుటుంబ సభ్యులతో కలిసి మిస్‌ యూనివర్స్ డ్యాన్స్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

| Edited By: Ravi Kiran

Mar 28, 2022 | 7:03 AM

Harnaaz Sandhu Dance: సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ కిరీటం దక్కేలా చేసింది 22 ఏళ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధూ (Harnaaz Kaur Sandhu).

Harnaaz Kaur Sandhu: జవాన్ల కుటుంబ సభ్యులతో కలిసి మిస్‌ యూనివర్స్ డ్యాన్స్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Harnaaz Sandhu
Follow us on

Harnaaz Sandhu Dance: సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ కిరీటం దక్కేలా చేసింది 22 ఏళ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధూ (Harnaaz Kaur Sandhu). ఏ మాత్రం అంచనాలు లేకుండా ‘మిస్ యూనివర్స్ 2021’ పోటీలకు వెళ్లిన ఈ చండీగఢ్‌ సొగసరి తన అందం, అంతకుమించిన తెలివితేటలతో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. తద్వారా సుస్మితా సేన్‌, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్‌గా గుర్తింపు పొందింది. ఇక మిస్‌ యూనివర్స్‌ పోటీల తర్వాత హర్నాజ్‌ క్రేజ్‌ ఆకాశానికి చేరుకుంది. వెండితెరపై అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే హర్నాజ్‌ సంధూకు సంబంధించిన డ్యాన్స్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇండో టిబేటియన్‌ బార్డర్‌ పోలీస్‌ (ITBP) ఆధ్వర్యంలో హిమ్‌వీర్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(HWWA) నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో హర్నాజ్‌ పాల్గొంది. ఈ సందర్భంగా సరిహద్దుల్లో సైనికుల సేవలను కొనియాడిన ఆమె జవాన్ల కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి ఫొటోలు దిగింది. అనంతరం వారితో కలిసి సరదాగా డ్యాన్స్‌ వేసింది. ఈ వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా పంజాబీ పాటలకు అద్భుతంగా స్టెప్పులేసి ఆకట్టుకుంది హర్నాజ్. ఆమె డ్యాన్స్ ఈవెంట్ మొత్తానికే హైలెల్‌గా నిలిచింది. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది ఐటీబీపీ. ‘మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు.. హిమవీర్ కుటుంబాలు, పిల్లలతో కలిసి గ్రూప్ పెర్ఫార్మెన్స్ చేశారు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ జిల్లా కోహాలి అనే గ్రామంలో పుట్టిన హర్నాజ్‌ మోడల్‌గా టీనేజీలో ఉండగానే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. 2017లో మిస్‌ చండీగఢ్‌గా నిలిచింది. 2019లో ఫెమినా మిస్‌ ఇండియా పంజాబ్‌ టైటిల్‌ గెల్చుకుంది. ఇక గతేడాదే ఇజ్రాయెల్ వేదికగా నిలిచిన మిస్‌యూనివర్స్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. కాగా ఈ పోటీల అనంతరం పంజాబీ భాషలో పలు సినిమా ఛాన్స్‌ లు దక్కించుకుంది హర్నాజ్‌. Yaara Diyan Poon Baran అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read:Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

భారత దేశంలో దొరికే వివిధ రకాల రొట్టెలు..

Viral Photo: ప్రకృతి విసిరిన సవాల్.. ఈ ఫోటోలో ఒక అద్భుతం దాగుంది.. అదేంటో కనిపెట్టగలరా?