Minissha Lamba: దంపతుల మధ్య బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిదంటున్నారు ప్రముఖ నటి మినిషా లాంబా.. ఏడాది క్రితం తన భర్త ర్యాన్ థామ్‌తో విడిపోయిన్నట్లు ప్రకటించిన మినిషా లాంబా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ర్యాన్, తాను స్నేహపూర్వకంగా విడిపోయామని, చట్టపరమైన విభజన జరిగిందని అన్నారు.
తామిద్దరం 2018 అక్టోబర్ నుంచి విడివిడిగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్రేమను పొందాలని దాన్ని ఆస్వాధించాలని ఆశిస్తారని తెలిపారు. ఆడవాళ్లు ప్రేమ విషయంలో ఒపెన్‌గా ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. గతంలో ఓ అమ్మాయికి చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు దాంతో ఆమె ప్రేమకు దూరంగా ఉంటానని చెప్తుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎదురుపడినప్పుడు ఆమె ఆ గోడలను బద్దలు కొట్టి ప్రేమను ఆహ్వానిస్తుందని అన్నారు.
హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం.. జల్‌పల్లి కార్గో రోడ్డులో సంచరిస్తున్నట్లు అనుమానాలు..