రెండో రోజు సైరా కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద ‘చిరు’ గర్జన

| Edited By:

Oct 04, 2019 | 11:19 AM

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సైరా ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన చిరు.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను కొనసాగించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 60కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన సైరా.. రెండో రోజు రూ.45కోట్లు సాధించాడన్నది ట్రేడ్ రిపోర్ట్. దీంతో కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి తన స్టామినాను మరోసారి ప్రూవ్ […]

రెండో రోజు సైరా కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద చిరు గర్జన
Follow us on

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సైరా ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన చిరు.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను కొనసాగించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 60కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన సైరా.. రెండో రోజు రూ.45కోట్లు సాధించాడన్నది ట్రేడ్ రిపోర్ట్. దీంతో కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు మెగాస్టార్. ఇక మొదటి రోజు 37కోట్లకు పైగా ఉన్న షేర్ కూడా 55కోట్లు దాటిందని.. ఈ వీకెండ్‌కు అది రూ.100కోట్లకు టచ్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతుందని వారు అంటున్నారు.

మరోవైపు కర్ణాటకలో చిరుకు క్రేజ్ ఓరేంజ్‌లో ఉండగా.. అక్కడ కూడా సైరా ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రోజు రూ.8కోట్ల వరకు రాబట్టిన సైరా.. రెండో రోజు కూడా రూ.5కోట్లు కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్‌లోనూ సైరా కలెక్షన్లు పర్వాలేదనిపిస్తున్నాయి. కానీ హిందీలో మాత్రం సైరాకు కలెక్షన్లు అనుకున్నంత రేంజ్‌లో రావడం లేదు. ఇదిలా ఉంటే రేపటి నుంచి వీకెండ్ ప్రారంభం కానుండగా.. కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

కాగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా తెరకెక్కింది. ఇందులో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, రవి కిషన్, విజయ్ సేతుపతి, తమన్నా తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించాడు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన సైరాను సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు.