Tiger Nageswara Rao: ఇటీవల ఖిలాడీ సినిమాతో మన ముందుకు వచ్చాడు మాస్ మహారాజా రవితేజ(Ravi Teja). ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఇది రవితేజ నటిస్తోన్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్‌గా సినిమాను లాంఛ్ చేశారు.
ఈ సినిమాలో కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు.పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు.ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. మొన్నామధ్య రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సినిమా లాంచింగ్ ఈవెంట్ కోసం కింది వీడియోను చూడండి.