Chiranjeevi: ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా ఏళ్ల పాటు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తదనంతరం రాజకీయాలను క్రమంగా దూరమవుతూ వచ్చిన చిరు మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2017లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో చిరు గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. పదేళ్లు గడిచినా తనలో స్టామిమా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన చిరు.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అనంతరం 2019లో సైరా నర్సింహా రెడ్డితో ఆకట్టుకున్న చిరు.. తర్వాత అనివార్యంగా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రం ఇపాటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే చిరు నుంచి కొత్త సినిమా లేక రెండేళ్లు అవుతోన్న నేపథ్యంలో స్పీడ్ పెంచారు. వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. చిరు ఇప్పటికే ఆచార్య చిత్రంతో పాటు.. ‘గాడ్‌ఫాదర్’, ‘బోళాశంకర్’, దర్శకుడు బాబీతో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం చిరు మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ కుడుముల చిరుకు ఓ కథ వినిపించాడని, దానికి చిరు కూడా వెంటనే ఓకే చెప్పారని సమాచారం. ఇక చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఏమేర నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?
Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?
Viral Video: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..