Pelli SandaD Pre Release Event: చిరు, వెంకీ స్పెషల్ అట్రాక్షన్.. గ్రాండ్‌గా ‘పెళ్లి సందడి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన 'పెళ్లి సందడి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి సందడిగా సాగుతోంది.

Pelli SandaD Pre Release Event:  చిరు, వెంకీ స్పెషల్ అట్రాక్షన్..  గ్రాండ్‌గా పెళ్లి సందడి ప్రీ రిలీజ్‌ ఈవెంట్
Pellisandad

Updated on: Oct 10, 2021 | 7:43 PM

Pelli SandaD Pre Release Event: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి సందడిగా సాగుతోంది. హైదరాబాద్ షేక్ పేట్ జేఆర్సీ కన్వెన్షన్లో జరుగుతోన్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్లి సందడి’ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకి గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండితెర అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్‌ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

పాతికేళ్ళ క్రితం శ్రీకాంత్‌ హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్ళిసందడి’ సినిమా మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. ఇప్పుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ తో దర్శకేంద్రుడు చేసిన ”పెళ్లి సందడి” ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలిమరి.

Read also: AP Weather Report: కోస్తాంధ్ర, రాయలసీమలకు రేపు, ఎల్లుండి వాతావరణ హెచ్చరికలు