టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మాస్ మహరాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ.. తన సినిమా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఆ మధ్యన అనూహ్యంగా దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన ఆయన ‘రాజా ది గ్రేట్’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ల హ్యాట్రిక్ ఫ్లాప్స్‌తో మళ్లీ ఢీలా పడ్డాడు.
ఇప్పుడు రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ మూవీలో రవితేజ న్యూ లుక్‌లో కనిపించనుండగా.. దానికి సంబంధించిన ఓ లుక్ తాజాగా బయటికొచ్చింది. అందులో కాస్త సన్నబడ్డ రవితేజ.. యంగ్ అవతార్‌లో అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇక ఈ లుక్‌ను చూస్తున్న పలువురు రవితేజ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా డిస్కో రాజాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నబా నటేష్, తన్యా హోప్ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.