Masooda OTT: ‘మసూద’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

చిన్నా, పెద్దా అనేది తేడా లేదు.. కంటెంట్ ఉంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రాలను పట్టం కడుతున్నారు.

Masooda OTT: మసూద ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Masooda

Updated on: Dec 15, 2022 | 8:21 AM

చిన్నా, పెద్దా అనేది తేడా లేదు.. కంటెంట్ ఉంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రాలను పట్టం కడుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ చేస్తున్నారు. ‘కార్తికేయ 2’, ‘కాంతారా’ లాంటివి ఈ కోవకు చెందినవే. తాజాగా ఈ జాబితాలోనే చిన్న సినిమాగా వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది ‘మసూద’. దర్శకుడు సాయికిరణ్ తెరకెక్కించిన ఈ హారర్ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా డిసెంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు సంస్థ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అలాగే డిసెంబర్ 16వ తేదీన ‘ఆహా’లో ‘ఇంటింటి రామాయణం’ అనే చిత్రం ప్రసారం కానుంది. ఇందులో  నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు సురేష్‌ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. అటు ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ మూడో ఎపిసోడ్ కూడా ఈ వారం ‘ఆహా’లో టెలికాస్ట్ కానుంది.