Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్‌ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..

మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్‌ మూవీ ‘సర్కారు వారి పాట’ (sarakaru vari pata). ‘గీత గోవిందం’ తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు

Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్‌ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..
Manjula Ghattamaneni

Edited By: Anil kumar poka

Updated on: Feb 24, 2022 | 9:34 AM

మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్‌ మూవీ ‘సర్కారు వారి పాట’ (sarakaru vari pata). ‘గీత గోవిందం’ తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక వేలంటైన్స్‌డే సందర్భంగా విడుదలైన ‘కళావతి’ పాట యూట్యూబ్ లో మిలియ‌న్ల సంఖ్యలో వ్యూస్ రాబ‌డుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట‌లో మ‌హేశ్ బాబు (Mahesh Babu) వేసే హుక్ స్టెప్పుల‌కు (Kalaavathi hook step) సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటికే హీరోయిన్ కీర్తిసురేశ్‌, మ‌హేశ్ కూతురు సితార, సంగీత దర్శకుడు థమన్‌ ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అద‌ర‌హో అనిపించారు. తాజాగా మ‌హేశ్ బాబు సోద‌రి, న‌టి మంజుల కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమార్తెగా వెండితెరపైకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘షో’ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. నటిగానే కాకుండా ‘పోకిరి’, ‘ఏమాయ చేశావే’ లాంటి చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంది. నాలుగేళ్ల క్రితం సందీప్‌ కిషన్‌ తో కలిసి ‘మనసుకు నచ్చింది’ అనే సినిమా కోసం దర్శకురాలిగా కూడా మారింది. ఇటీవల సుమంత్ హీరోగా న‌టించిన మ‌ళ్లీ మొద‌లైంది చిత్రంలో ఒక కీలక పాత్రలోనూ నటించింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే ఆమె హెల్త్‌, ఫిట్‌నెస్‌ మెలకువలను ఫ్యాన్స్‌ తో షేర్‌ చేస్తుంటుంది. అదేవిధంగా ట్రెండింగ్ లో ఉన్న సినిమా పాటలను రీక్రియేట్‌ చేస్తూ వాటి వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది .అలా తాజాగా కళావతి సాంగ్‌ను రీక్రియేట్‌ చేసింది మంజుల. బ్లాక్ టీ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్ ధరించిన ఆమె అచ్చం మ‌హేశ్‌లాగే స్టెప్పులేసింది. అనంతరం తన డ్యాన్స్ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్‌ గామారింది.

Also Read:Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

Telangana: ఆ కీచకులను చెప్పుతో కొట్టండి.. గుండెలు పిండేస్తున్న యువతి సూసైడ్ లెటర్..

UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..