
హైదరాబాద్: మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘ఓటర్’. తాజాగా ‘ఓటు విలువ నువ్వు తెలుసుకో..’ అంటూ సాగే ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఎన్నికల టైంలో రిలీజైన ఈ పాట ప్రజలను ఆలోచింపజేస్తుంది. సాయి చరణ్ భాస్కరుణి పాడిన ఈ పాటకు ఫేమస్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. జీఎస్ కార్తిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. కాగా అన్నీ పార్టీల రాజకీయ నాయకులను ఈ పాటలో చూపించారు. మంచు విష్ణు సరసన సురభి హీరోయిన్‌గా నటించింది. రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.