Maa Elections 2021: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్.. ‘కుటుంబం జోలికొస్తే సహించేది లేదు’..

Maa Elections 2021: మా ఎన్నికల పోరు క్లైమాక్స్‌కి చేరింది. దీంతో ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.

Maa Elections 2021: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్.. కుటుంబం జోలికొస్తే సహించేది లేదు..
Manchu Vishnu

Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2021 | 8:36 AM

Maa Elections 2021: మా ఎన్నికల పోరు క్లైమాక్స్‌కి చేరింది. దీంతో ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ‘మా’ ఎన్నికల సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవమని మిమ్మల్ని విమర్శిస్తే ఆయనను విమర్శించినట్లేనని వినమ్రంగా అన్నారు. అందుకే నాగబాబు అంక్‌ల్‌పై విమర్శలు చేయనని చెబుతూ ఇలా మాట్లాడారు.

‘ నాగబాబు అంకుల్‌ నేను ఏం చేశానని నాపై అంతకోపం.. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు.. మీ ముందే కదా పెరిగాను.. మీరు మా సంస్థలో నటించారు. మా కుటుంబ సభ్యులందరు మిమ్మల్ని గౌరవిస్తారు. అయినా మీరు ఇలా చేయడం బాగాలేదు. ఒకప్పుడు నా ప్రత్యర్థి పవన్‌ కల్యాణ్‌ గురించి ఇష్టారీతిన మాట్లాడారు. మీకు గుర్తుండే ఉంటుంది. సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ ఈ రోజు ఆయన మీకు మేధావి అయిపోయి, నన్ను చిన్న చూపు చూస్తున్నారు. మీరు అలా మాట్లాడటం నాకు కష్టంగా ఉంది అంకుల్’ అన్నారు.

‘మీకన్నా నాకు చిరంజీవిగారు అంటే అభిమానం, ప్రేమ, గౌరవం. మిమ్మల్ని విమర్శిస్తే ఆయనను విమర్శించినట్టే. తెలుగులో నాకు మార్కులు తక్కువ రావచ్చు. కానీ, క్యారెక్టర్‌ విషయంలో మార్కులు వేయాల్సి వస్తే, ఎవరికి ఎక్కువ వస్తాయో ఇండస్ట్రీ వాళ్లను అడగండి చెబుతారు. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితే, నాది, నా కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు మీ ఫ్యాన్స్‌కు ఇచ్చి తిట్టమని చెబుతారు. కావాలంటే మీరు మా నెంబర్లు ఇవ్వవచ్చు. గతంలో కూడా జీవిత రాజశేఖర్ విషయంలో ఇలాగే చేశారు కదా. నా కుటుంబం జోలికి వస్తే సహించేది లేదు. ఎవరినీ క్షమించే ప్రసక్తి లేదు. తన ఫ్యామిలీపై ఎవరైనా కామెంట్లు చేస్తే జీవితంలో క్షమించను’ అన్నారు.

Viral Video: చేపలు పడుతున్న తండ్రీకొడుకులకు ఊహించని షాక్‌ ఇచ్చింది ఓ మొసలి.. వైరల్ గా మారిన వీడియో..

Viral Video: ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. ఈ వీడియో చుస్తే నవ్వుకోవాలో జాలి చూపించాలో మిరే చెప్పండి..

Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్‌తో కంగుతిన్న కస్టమర్‌.. పార్శిల్‌లో పవర్‌ బ్యాంక్‌కు బదులుగా మరోది ప్రత్యక్షం..(వీడియో)