Chef Mantra -2: చెఫ్ మంత్ర సీజన్ – 2 కు వ్యాఖ్యాతగా మంచు లక్ష్మి.. వైరల్ అవుతోన్న ప్రోమో వీడియో

|

Sep 23, 2022 | 5:51 PM

టీవీల్లో వినోద కార్యక్రమాలకు కొదవే లేదు. ఎన్నో రకాల షోస్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్, కామెడీ, సింగింగ్, కుకింగ్ షోలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది....

Chef Mantra -2: చెఫ్ మంత్ర సీజన్ - 2 కు వ్యాఖ్యాతగా మంచు లక్ష్మి.. వైరల్ అవుతోన్న ప్రోమో వీడియో
Manchu Laxmi Chef Mantra
Follow us on

టీవీల్లో వినోద కార్యక్రమాలకు కొదవే లేదు. ఎన్నో రకాల షోస్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్, కామెడీ, సింగింగ్, కుకింగ్ షోలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. టీవీల్లో మాత్రమే కారుండా ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లో సినిమాలు డాన్స్ షోలో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలను ప్రసారం అయ్యాయి. ఆహా వేదికగా చెఫ్ మంత్ర అనే ఫుడ్ కార్యక్రమం కూడా ప్రసారమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమం మొదటి సీజన్ పూర్తి చేసుకున్నప్పటికీ త్వరలోనే రెండో సీజన్ ప్రారంభం కానుంది. సీజన్ వన్ కు శ్రీముఖి యాంకర్ గా వ్యవహిరించింది. అయితే త్వరలో ప్రసారం కానున్న సీజన్ 2 కార్యక్రమం కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సెలబ్రిటీలను ఆహ్వానించి వారి చేత వంటలు చేయిస్తూ వారి నుంచి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30 నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రతి శుక్రవారం ప్రసారం కానుంది. ఇక ఈ కార్యక్రమం పై మంచు లక్ష్మి మాట్లాడుతూ తాను ఇలా ఫుడ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి