Trailer Talk: మారుతి మార్క్‌ కామెడీతో ‘మంచి రోజులు వచ్చాయి’.. ట్రైలర్‌ ఎలా ఉందో చూశారా.?

|

Oct 14, 2021 | 10:33 AM

Trailer Talk: మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. 'ఏక్‌ మినీ కథ' వంటి సూపర్‌ హిట్‌ తర్వాత శోభన్‌ నటిస్తోన్న చిత్రం కావడం, 'ప్రతి రోజూ పండగే' విజయం..

Trailer Talk: మారుతి మార్క్‌ కామెడీతో మంచి రోజులు వచ్చాయి.. ట్రైలర్‌ ఎలా ఉందో చూశారా.?
Manchi Rojulu Vachhayi
Follow us on

Trailer Talk: మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ‘ఏక్‌ మినీ కథ’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత శోభన్‌ నటిస్తోన్న చిత్రం కావడం, ‘ప్రతి రోజూ పండగే’ విజయం తర్వాత మారుతి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మారుతి కూడా తన మార్కు కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మేలవించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు ఇదే విషయాన్ని చెప్పాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్‌ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

దసరా కానుకగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. 1.49 నిమిషం నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఎంటర్‌టైనర్‌గా ఉంది. ముఖ్యంగా మారుతి మార్కు కామెడీ, కుటంబ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రేమలో పడ్డ ఇద్దరు యువతీ, యువకులు తమ ప్రేమకు పెద్దలను ఎలా ఒప్పించారన్న కథాంశంతో ఈ సినిమా రానున్నట్లు అర్థమవుతోంది. ఇక ప్రతీ సిసినిమాలో హీరోలకు ఏదో లోపం ఉందన్నట్లు చూపించే మారుతి ఈసారి హీరోయిన్‌ తండ్రికి ఏదో వింత వ్యాధి ఉన్నట్లు చూపించారు. ఇది ట్రైలర్‌లో ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు.

ఇక తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ఇందులో చూపించారు. ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తుండగా.. యూవీ క్రియేషన్స్, మాస్‌ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి మారుతి తన సక్సెస్‌ జోరును కొనసాగిస్తారా.? ఈ సినిమాతో శోభన్‌ మరో మెట్టు ఎక్కుతాడా.? తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Also Read: చంద్రుడిపై నడిచే బైక్‌.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో

సరికొత్త రూట్‌లో గోల్డ్‌ స్మగ్లింగ్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. వీడియో

Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..