AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు చేరనుంది. కేంద్రం ఆయనను అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనుంది. ఈ నెల 23న ఈ అవార్డును ప్రదానం చేయనుంది. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలకు గానూ కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది.

Mohanlal: సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..
Superstar Mohanlal To Receive Dadasaheb Phalke Award
Krishna S
|

Updated on: Sep 20, 2025 | 7:01 PM

Share

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. కేంద్రం ఆయనకు సినిమా రంగంలోనే అత్యున్నతమై దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ నెల 23న ఈ అవార్డును ప్రదానం చేయనుంది. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలకు గానూ కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది.

ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2023 ఏడాదికి గానూ మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం సంతోషంగా ప్రకటిస్తోంది. మోహన్‌లాల్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన అద్భుతమైన కృషికి గానూ ఈ అవార్డును అందిస్తున్నాం. ఆయన అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అవిశ్రాంత కృషి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక బంగారు ప్రమాణాన్ని నెలకొల్పాయి’’ అని ట్వీట్ చేసింది.

రెండో వ్యక్తిగా లాల్..

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న మోహన్ లాల్.. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటనకు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి పురస్కారాలు లభించాయి. మలయాళ సినీ పరిశ్రమ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న రెండో వ్యక్తి మోహన్ లాల్. గతంలో ప్రముఖ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్‌కు ఈ అవార్డు లభించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.