Aparna Balamurali: బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టిన మలయాళీ కుట్టీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

సినిమా కోసం కొంతమంది అందాల తారలు తమను తాము మార్చుకుంటున్నారు. హీరోలకు ధీటుగా వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తున్నారు. ఇప్పుడు మలయాళ కుట్టీ అపర్ణా బాల మురళి (Aparna Balamurali) కూడా అదేపనిలో ఉంది

Aparna Balamurali: బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టిన మలయాళీ కుట్టీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Aparna Balamurali

Updated on: Mar 12, 2022 | 10:56 AM

సినిమా కోసం కొంతమంది అందాల తారలు తమను తాము మార్చుకుంటున్నారు. హీరోలకు ధీటుగా వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తున్నారు. ఇప్పుడు మలయాళ కుట్టీ అపర్ణా బాల మురళి (Aparna Balamurali) కూడా అదేపనిలో ఉంది. సూర్య (Suriya) నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంతో మొదటిసారి ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో ‘బొమ్మి’ అనే పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడామె తన తర్వాతి సినిమా కోసం సన్నద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం కోసం బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టింది అపర్ణా. ట్రైనర్‌ సహాయంతో బాక్సింగ్ మెలకువలు నేర్చుకుంటోంది. తాజాగా తన బాక్సింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. గ్లోవ్స్‌ ఎమోజీని క్యాప్షన్‌గా ఇస్తూ షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టంట్లో వైరల్ అయింది. నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోను చూసిన మరో కోలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి ‘నేను కూడా బాక్సింగ్‌ చేయాలనుకుంటున్నాను’ అని రిప్లై ఇచ్చింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది అపర్ణా బాలమురళి. ఆమె ప్రస్తుత నిథం ఓరు వానమ్‌ (తెలుగులో ఆకాశం) అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో అపర్ణతో పాటు రీతూ వర్మ, శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సుందరి గార్డెన్ అనే మలయాళ చిత్రం షూటింగ్‌కు కూడా రెడీ అవుతోంది. నీరజ్ మాధవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు కార్తి, ఉన్ని ముకందన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:Telangana Assembly: ప్రారంభమైన అసెంబ్లీ… కీలకాంశాలపై మంత్రుల సమాధానాలు

Nagendra Babu: తగ్గేదే లే అంటున్న మెగా హీరో.. కొడుక్కి గట్టిపోటీ అంటున్న మెగా ఫ్యాన్స్.. ట్రెండ్ అవుతున్న నాగబాబు ఫొటోస్..

Anatapuram: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. రేపు లక్ష్మీనరసింహుని కళ్యాణం.. భారీగా ఏర్పాట్లు