AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Movie- Aha OTT: ‘ఆహ’లో మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్.. ‘వన్’ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

అనుక్షణం ఆకట్టుకునే ఆసక్తికర వెబ్ సిరీస్.. సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తోంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.

One Movie- Aha OTT: 'ఆహ'లో మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్.. 'వన్' ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
One Movie
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2021 | 9:50 PM

Share

అనుక్షణం ఆకట్టుకునే ఆసక్తికర వెబ్ సిరీస్.. సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తోంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ప్రతి వారం వారం సరికొత్త కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా.. ఇతర భాషల్లోని చిత్రాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‏ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతుంది. అటు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా.. టాల్క్ షోలతోనూ అలరిస్తుంది. ఇప్పటికే ఎన్నో సస్పెన్స్ చిత్రాలను అందిస్తున్న ఆహా. తాజాగా మరో సూపర్ హిట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా ‘వన్’. ఈ మూవీకి సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా.. ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. శ్రీలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 30న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వన్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‏ను విడుదల చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో ఓ సాధారణ వ్యక్తి రాజకీయాలలోకి అడుగుపెట్టడం.. ముఖ్యమంత్రి వరకు ఎదిగే క్రమంలో ఎదురైన ఒడిదుడుకులు.. సీఎం అయిన తర్వాత అతడికి ఎదురైన రాజకీయ సవాళ్లు ఏంటీ ? రాజకీయ కుట్రలను తట్టుకుని ఎలా నిలబడ్డాడు అనే కథాంశంతో వన్ సినిమా తెరకెక్కింది. ఇందులో ముఖ్యమంత్రిగా మమ్ముట్టి గెటప్.. హావాభావాలు.. డైలాక్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ‘గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం.. లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చూడటం.. ఇవే నేటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలు’ ‘నేను ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాదు.. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి ముఖ్యమంత్రిని’ అంటూ మమ్ముట్టి చెప్పే డైలాగ్స్ అలరిస్తున్నాయి. ఈ సినిమాలో మురళీ గోపి – జగదీష్ – అలెన్సియర్ లే లోపేజ్ – నిమిషా సజయన్ – జోజు జార్జ్ – సుధీర్ కరమణ కీలక పాత్రలలో నటించారు.

Also Read: Bangarraju Movie: మరోసారి నాగార్జునకు జోడీగా శ్రియ.. ‘బంగార్రాజు’ సినిమాలో..

Skin Care Tips: చర్మానికి పసుపును రాస్తున్నారా?.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..