AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రౌడీ’ హీరోయిన్‌కు ‘మహర్షి’తో లింక్.. ఎవరా బ్యూటీ?

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఫోకస్ పెట్టిన విజయ్ దేవరకొండ తను నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక రీసెంట్‌గా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రాన్ని విజయ్ దేవరకొండ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ […]

'రౌడీ' హీరోయిన్‌కు 'మహర్షి'తో లింక్.. ఎవరా బ్యూటీ?
Ravi Kiran
|

Updated on: May 20, 2019 | 1:00 PM

Share

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఫోకస్ పెట్టిన విజయ్ దేవరకొండ తను నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక రీసెంట్‌గా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రాన్ని విజయ్ దేవరకొండ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తోంది.

తమిళంలో పలు చిత్రాల్లో నటించిన మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులకు రజినీకాంత్ ‘పేట’ సినిమాతో సుపరిచితమే. అయితే ఆమె స్ట్రెయిట్ తెలుగు డెబ్యూ మూవీ మాత్రం విజయ్ దేవరకొండ ‘హీరో’ అని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే మాళవిక తండ్రి మోహనన్ తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో బడా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఆయన తొలిసారిగా తెలుగులో ‘మహర్షి’ సినిమాకి వర్క్ చేశాడు.  ఇప్పుడు ఆయన కూతురు మాళవిక హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.

నటిగా తానేంటో నిరూపించుకున్న మాళవిక తండ్రి పేరును వాడుకోకుండా కెరీర్‌లో ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. ‘పేట’ సినిమాలో సూపర్ స్టార్‌కు చెల్లి పాత్రలో నటించి మెప్పించిన మాళవిక ఇప్పుడు హీరోయిన్‌గా విజయ్ దేవరకొండ సరసన ఎలాంటి మెరుపులు మెరిపిస్తోందో చూడాలి. విజయ్ ఈ సినిమాలో బైక్ రేసర్‌గా కనిపిస్తుండగా..సినిమా మొదటి షెడ్యూల్‌ను ఢిల్లీలో ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

Follow Us
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్