‘రొమాంటిక్’ కోసం దండుపాళ్యం నటుడు

|

Mar 18, 2019 | 3:52 PM

ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాండూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి మందిరా బేడీ ని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు మకరంద దేశ్ పాండే ను ఒక ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారట. ‘దండుపాళ్యం’ […]

రొమాంటిక్ కోసం దండుపాళ్యం నటుడు
Follow us on

ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాండూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి మందిరా బేడీ ని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు మకరంద దేశ్ పాండే ను ఒక ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశారట.

‘దండుపాళ్యం’ సిరీస్ తో అటు బాలీవుడ్ లోనే కాదు ఇటు దక్షిణాదిలో కూడా బాగా పాపులర్ అయ్యాడు మకరంద దేశ్ పాండే. ఈ సినిమాను పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.