నా డైరక్టర్లూ..’మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకకు రారండి!

మహేష్ బాబు  25వ చిత్రంగా వస్తుంది ‘మహర్షి’ మూవీ. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది.  ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మే 1న నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించనున్నారు.  ఇది తన సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో మహేష్ బాబు తన గత 24 చిత్రాల దర్శకులందరినీ ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, […]

నా డైరక్టర్లూ..మహర్షి ప్రీ రిలీజ్ వేడుకకు రారండి!

Updated on: Apr 24, 2019 | 5:14 PM

మహేష్ బాబు  25వ చిత్రంగా వస్తుంది ‘మహర్షి’ మూవీ. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది.  ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మే 1న నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించనున్నారు.  ఇది తన సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో మహేష్ బాబు తన గత 24 చిత్రాల దర్శకులందరినీ ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్, పివీపి సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మహేష్ బాబుకు జోడీగా పూజ హెగ్డే నటించింది. రైతుల బ్యాక్ డ్రాప్‌తో పాటు, ప్రెండ్షిప్, ఫాదర్ సెంటిమెంట్‌తో సినిమా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ‘దిల్’ రాజు సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు సమాచారం. మరి మహేష్ మైల్ స్టోన్ మూవీతో బాక్సాఫీస్ లెక్కలు తేలుస్తాడో, లేదో చూడాలి.