Mahesh and Namrata :వాలంటైన్స్‌ డేకి సర్‌ప్రైజ్ గిప్ట్ అందుకున్న మహేష్, నమ్రత దంపతులు

|

Feb 15, 2021 | 10:16 AM

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు పెరిగి పెద్దయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇచ్చే బహుమతి ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే చిన్నతనంలోనే తమ చిట్టి చిట్టి చేతులతో స్వయంగా చేసిన గిఫ్ట్ ను బహుమతిగా ఇస్తే..

Mahesh and Namrata :వాలంటైన్స్‌ డేకి సర్‌ప్రైజ్ గిప్ట్ అందుకున్న మహేష్, నమ్రత దంపతులు
Follow us on

Mahesh and Namrata :ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు పెరిగి పెద్దయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇచ్చే బహుమతి ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే చిన్నతనంలోనే తమ చిట్టి చిట్టి చేతులతో స్వయంగా చేసిన గిఫ్ట్ ను బహుమతిగా ఇస్తే ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఇప్పుడు అదే అనుభూతిని సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతులు..
వివరాల్లోకి వెళ్తే..

మహేష్ నమ్రతల ముద్దుల తనయ.. సినిమాల్లోని రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఓ బుల్లి సెలబ్రేటీనే.. సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ.. సెలబ్రెటీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మహేష్ బాబు ముద్దుల తనయగానే కాకుండా ఆటలు, పాటలు, వంటి టాలెంట్ ను ప్రదర్శిస్తూ.. తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది సితార. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పేరెంట్స్‌కు మంచి బహుమతిని అందించి వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది మహేష్ ముద్దుల తనయ..

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని మహేష్‌, నమ్రతకు గ్రీటింగ్‌ కార్డు ఇచ్చింది సితార. దానిపై లవ్‌ యూ అమ్మ, నాన్న.. హ్యపీ వాలెంటైన్‌ డే అని రాసిచ్చింది. కూతురు నుంచి ఇలా ఊహించని గిఫ్ట్‌ అందడంతో మహేష్‌ దంపతులు ఎమోషనల్‌ అయ్యారు. ఇక కూతురు ప్రేమగా ఇచ్చిన గ్రీటింగ్‌ కార్డును అభిమానులతో పంచుకున్నాడు మహేష్‌. థ్యాంక్‌ యూ సితూ పాప అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోను షేర్ చేశారు. ఇక తల్లి నమ్రత సైతం సితార గిఫ్టుకు మురిసిపోయి, థ్యాంక్యూ తల్లి అంటూ కూతురుపై ప్రేమను కురిపించింది.
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నాడు.. ఫ్యామిలీ కూడా అక్కడే ఉండడంతో.. ఓ వైపు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు సినిమా షూటింగ్ ను చేస్తున్నాడు ప్రిన్స్

Also Read:

మరో ప్రయోగం చేయనున్న నారా రోహిత్‌.. ఈసారి 1970లో జరిగిన యుద్ధం నేపథ్యంలో..

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి