Keerthy Suresh: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోన్న మహానటి.. సమంత బాటలోనే కీర్తి సురేష్‌.

|

Aug 26, 2021 | 12:25 PM

Keerthy Suresh: 'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' ఈ సామెతను మనలో చాలా మంది వినే ఉంటారు. వయసులో ఉండి, డబ్బు సంపాదిస్తున్న సమయంలోనే కాసిన్ని డబ్బులు వెనుకేసుకోవాలనే...

Keerthy Suresh: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోన్న మహానటి.. సమంత బాటలోనే కీర్తి సురేష్‌.
Follow us on

Keerthy Suresh: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ ఈ సామెతను మనలో చాలా మంది వినే ఉంటారు. వయసులో ఉండి, డబ్బు సంపాదిస్తున్న సమయంలోనే కాసిన్ని డబ్బులు వెనుకేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సామెతను చెబుతుంటారు. అయితే ఈ సామెతను ఎవరు ఫాలో అయినా, కాకపోయినా.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం తూచా తప్పకుండా ఫాలో అవుతుంటారు. మరీ ముఖ్యంగా నటీమణులు ఈ సామెతను మరింత సీరియస్‌గా తీసుకుంటుంటారు. దీనికి నిదర్శనమే హీరోయిన్లు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం. సినిమాలు చేస్తోన్న సమయంలోనే నాలుగు రాళ్లు వెనుకేసుకునే హీరోయిన్లు బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఇప్పటికే నటి సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లాంటి నటీమణులు ఇప్పటికే రకరకాల బిజినెస్‌లను ఏర్పాటు చేసి.. విజయవంతంగా నడిపిస్తున్నారు కూడా. ఇదిలా ఉంటే తాజాగా మహానటి ఫేమ్‌ కీర్తి సురేష్‌ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. మహానటితో నేషనల్‌ అవార్డు అందుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది.

ఈ క్రమంలోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్‌తో కలిసి స్కిన్‌ కేర్‌ ఉత్పత్తుల తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. భూమిత్ర బ్రాండ్‌ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విషయమై కీర్తి సురేష్‌ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో సౌందర్యాన్ని మెరుగుపరిచే విధంగా స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. కెరీర్‌ విషయానికొస్తే కీర్తి ప్రస్తుతం భోలా శంకర్‌, సర్కారు వారి పాట చిత్రాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.

 

Also Read: Pawan Kalyan: ద పవర్.. ద స్టార్.. ద కింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ బోనంజా.. గెట్ రెడీ..!

శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ప్రాంతం.. ముష్కరులను మూడుచెరువుల నీళ్లు తగ్గించే నాయకులు..వీరి బలమేంటో తెలుసా?

International Dog Day 2021: నేడు అంతర్జాతీయ కుక్కల దినోత్సవం.. శునకాలతో ప్రయోజనాలు ఏమిటి..?