Monalisa: కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు మరో సినిమా ఛాన్స్.. వీడియో వైరల్.. ఈసారి ఏం జరుగుతుందో!
కొన్నాళ్లక్రితం జరిగిన మహా కుంభమేళాలో పూసలమ్ముతూ తెగ వైరల్ అయిపోయింది మోనాలిసా. ఏకంగా సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఒక దర్శకుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లి సినిమా కూడా తీస్తానన్నాడు. కానీ ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు.

మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన ఆమె కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ యూట్యూబర్లకు కనిపించింది. అంతే ఫొటోలు, వీడియోలు చేసి సెలబ్రిటీని చేసేశారు. నెట్టింట ఎక్కడ చూసిన ఆమె ఫొటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. ఆ తర్వాత మోనాలిసా పేరు దేశ వ్యాప్తంగా మార్మో ఇస్తానని ప్రకటించారు. ఇందుకోసం ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. అగ్రిమెంట్ కూడా కుదర్చుకున్నారు. ఇంతోలనే డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. అతను మోసగాడని, సినిమా అవకాశాల పేరుతో మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని.. డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అతనిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయ. దీంతో మోనాలిసా మొదటి సినిమా ఏమైందో ఇప్పటికీ అప్డేట్ లేదు. అయితే మోనాలిసా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ మధ్యన షాప్ ఓపెనింగ్స్ కు కూడా హాజరైందీ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమెకు మరో సినిమా ఛాన్స్ వచ్చింది. అయితే ఇది కేవలం ప్రైవేట్ సాంగ్ మాత్రమే. ఉత్కర్ష్ సింగ్ అనే నటుడు తీసిన ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాలిసాని తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
కుంభమేళాలో పూసలమ్మే టైంకి.. ఇప్పటికీ చాలా మారిపోయింది మోనాలిసా. బయట ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోందామె. దీంతో కొన్ని సార్లు బాగా ట్రోలింగ్ కు కూడా గురువుతోంది. అదే సమయంలో సినిమా పేరుతో మోనాలిసాను మభ్య పెడుతున్నారని ఆమెను ఛీట్ చేస్తున్నారంటూ చాలా మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మోనాలిసా కూడా ఈ రంగుల ప్రపంచంపై ఆశ వదిలిపెట్టాలని సొంతూర వెళ్లిపోవాలంటున్నారు.
ప్రైవేట్ సాంగ్ లో మోనాలిసా..
View this post on Instagram
ఉత్కర్ష్ సింగ్ బృందంతో మోనాలిసా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
