Chiru in Lucifer Remake: ‘లూసిఫర్’ రీమేక్‌.. లైన్‌లోకి ‘మెగాస్టార్’ ఫేవరెట్ డైరక్టర్..!

మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్‌ను తెలుగులో రీమేక్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకోగా.. చిరుతో ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తొలుత సుకుమార్ పేరు వినిపించింది

Chiru in Lucifer Remake: లూసిఫర్ రీమేక్‌.. లైన్‌లోకి మెగాస్టార్ ఫేవరెట్ డైరక్టర్..!

Edited By:

Updated on: Feb 28, 2020 | 4:50 PM

Chiru in Lucifer Remake: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ను తెలుగులో రీమేక్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకోగా.. చిరుతో ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడిగా తొలుత సుకుమార్ పేరు వినిపించింది. కానీ రీమేక్‌లపై అంత ఆసక్తిని చూపని సుకుమార్.. ఈ ప్రాజెక్ట్‌ను చేయలేనని రామ్ చరణ్‌కు చెప్పారట. కావాలంటే ఇంకో కథను రెడీ చేస్తానని అన్నారట. ఇక ఆ తరువాత పరశురామ్ పేరు వినిపించింది. ఇక పరశురామ్ కూడా మహేష్‌తో సినిమాకు రెడీ అవుతోన్న సమయంలో ఇప్పుడు మరో స్టార్ దర్శకుడి పేరు ఫిలింనగర్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనెవరంటే.. వివి వినాయక్.

మెగాస్టార్‌తో వినాయక్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఠాగూర్‌ సినిమా కోసం వీరిద్దరు మొదటిసారిగా కలిసి పనిచేశారు. ఇక అప్పటినుంచే చిరుకు వినాయక్‌పై నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే రీఎంట్రీ సమయంలో ఎంతోమంది స్టార్ దర్శకులు ఉన్నా.. వినాయక్‌నే ఎంచుకున్నారు మెగాస్టార్. ఇక ఇప్పుడు లూసిఫర్ రీమేక్‌కు ఆయనే న్యాయం చేయగలడని చిరు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంటలిజెంట్ ఫ్లాప్‌ తరువాత దర్శకత్వానికి దూరమయ్యారు వినాయక్. ఈ క్రమంలో హీరోగా సీనయ్య అనే మూవీలో నటించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు మళ్లీ దర్శకుడిగా వచ్చేందుకు ఆయన ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరు, వినాయక్‌ను పిలిచి లూసిఫర్ రీమేక్‌పై సంప్రదింపులు జరిపినట్లు టాక్. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు వినాయక్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే చిరు-వినాయక్‌ కాంబోలో హాట్రిక్ సినిమా తెరకెక్కడం ఖాయం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Read This Story Also: మెగా హీరోలను చెర్రీ ఎందుకు వద్దనుకున్నాడు..!