లాక్‌డౌన్‌ వలన జీవితం చాలా చిన్నదని తెలుసుకున్నా..!

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మన దేశం కూడా ఉంది. మొదట 21 రోజులంటూ మొదలైన లాక్‌డౌన్‌ను ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. ఇదంతా పక్కనపెడితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం తమ కుటుంబసభ్యులకు సమాయాన్ని కేటాయిస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ వలన జీవితం చాలా చిన్నదని తెలుసుకున్నానని బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్‌ […]

లాక్‌డౌన్‌ వలన జీవితం చాలా చిన్నదని తెలుసుకున్నా..!

Edited By:

Updated on: May 11, 2020 | 7:21 PM

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మన దేశం కూడా ఉంది. మొదట 21 రోజులంటూ మొదలైన లాక్‌డౌన్‌ను ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. ఇదంతా పక్కనపెడితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం తమ కుటుంబసభ్యులకు సమాయాన్ని కేటాయిస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ వలన జీవితం చాలా చిన్నదని తెలుసుకున్నానని బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ అంటున్నారు.

మనం ఉన్నా లేకపోయినా ఈ విశ్వం ముందుకు వెళుతూనే ఉంటుంది. అందుకే మనం మంచిని చేస్తుండాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండచ్చు. కానీ రేపు ఉండకపోవచ్చు. ఏదేమైనా ప్రేమను పంచుతూ ఉండాలి అని ఆమె అన్నారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె సల్మాన్‌ ఖాన్ ఫామ్‌ హౌస్‌లో నివసిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: పవన్‌తో సినిమాపై రాక్‌స్టార్ ఏమన్నారంటే..!