Thalapathy Vijay: అభిమానం ఓటుగా మారేనా? పాలిటిక్స్‌లో విజయ్‌ సక్సెస్‌ అయ్యేనా?

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావడం ఓ ట్రెండ్ లా మారింది. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి సాధించిన వారు కొందరైతే అనుకున్నది కలిసిరాని సెలబ్రెటీలు ఎందరో.. తాజాగా తమిళ పరిశ్రమ నుంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు.

Thalapathy Vijay: అభిమానం ఓటుగా మారేనా? పాలిటిక్స్‌లో విజయ్‌ సక్సెస్‌ అయ్యేనా?
Thalapathy Vijay

Edited By: Basha Shek

Updated on: Feb 03, 2024 | 6:41 AM

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రావడం ఓ ట్రెండ్ లా మారింది. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి సాధించిన వారు కొందరైతే అనుకున్నది కలిసిరాని సెలబ్రెటీలు ఎందరో.. తాజాగా తమిళ పరిశ్రమ నుంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. దీంతో సినీపరిశ్రమ రాజకీయ రంగంలో సక్సెస్ గురించి దేశవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది. సినీరంగంలో తమకున్న క్రేజ్ ను ఓట్ల రూపంలోకి మార్చడం ప్రతిసారీ కలిసిరావడం లేదు. ఇదంతా కూడా మనం ఎక్కువగా దక్షిణ భారతదేశంలో చూసిన చరిత్ర. తమిళనాడులో ఎంజీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీ రామారావు ఏర్పాటు చేసిన పార్టీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తమిళనాట ‘ తమిళగ వెట్రి కజగం’ పేరుతో నటుడు విజయ్‌ దళపతి పార్టీ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ సినీ పాలిటిక్స్ పై చర్చకు దారితీసింది.

రజనీకాంత్

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని 1990 నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది.
ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినా, పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. 2017లోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి తమిళనాడులో రజినీ మక్కల్ మండ్రం ఏర్పాటు చేశారు. 2021లో దాన్ని రద్దు చేసి ఇకపై రాజకీయాల్లోకి రాలేనని రజనీకాంత్ ప్రకటనతో ప్రచారానికి పుల్ స్టాప్ పడింది.

విజయ్ కాంత్

2011లో ఎండీఎంకే పార్టీని స్థాపించిన మరో హీరో విజయ్ కాంత్ ఆ ఎన్నికల్లో తానొక్కడే విజయం సాధించారు. ఆతర్వాత 2016 లో ఎడిఎంకెతో పొత్తుపెట్టుకున్న విజయ్ కాంత్ 29 స్థానాల్లో గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించినా ఆతర్వాత జీరో అయ్యారు

ఇవి కూడా చదవండి

కమల్ హాసన్

కమల్ తమిళనాడులో 2018లో మక్కల్ నీది మయ్యమ్‌ పేరుతో పార్టీ స్థాపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ 37 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు.

చిరంజీవి

2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.2009 ఎన్నికల్లో పార్టీ శాసనసభలో పోటీ చేసి 294 సీట్లలో 18 స్థానాలను గెలుచుకుంది. 2011లో, చిరంజీవి పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. 2014లో ఏపీ విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారాయన.

పవన్ కళ్యాణ్

చిరంజీవి రాజకీయాలకు దూరం కాకముందే పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని ప్రకటించారు. పవన్ కల్యాణ్ బిజెపి, టిడిపికి మద్దతు ఇచ్చారు. 2019లో సీట్లు గెలవలేకపోయిన పవన్ కల్యాణ్ తర్వాత 2024లో కూడా పవన్ టీడీపీతో జతకట్టి బీజేపీతో కూడా కలిసే ఉంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో చూడాల్సిఉంది.

ఉపేంద్ర

2018లో కర్ణాటకలో పార్టీని ఉపేంద్ర ఏర్పాటు చేశారు. కర్ణాటకలో కూలీల కోసం పెట్టిన పార్టీ అని బలంగా చెప్పినా సక్సెస్ కాలేదు..

ఇప్పుడు పార్టీని ప్రకటించిన విజయ్ సక్సెస్ సాధించగలరా.. దక్షిణాదిన ఎంజీఆర్, ఎంటీఆర్ తర్వాత ఎవరికీ రాని సక్సెస్ ను విజయ్ అందుకోగలరా లేదా అన్నది చూడాలి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.