ఫిలింఛాంబర్‌లో రామానాయుడు విగ్రహావిష్కరణ

మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి. రామానాయుడు 83వ జయంతి వేడుకలు ఫిల్మ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు కుటుంబం నుంచి సురేశ్ బాబు, అభిరామ్‌ పాల్గొనగా.. వారితో పాటు తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు, ఆదిశేషగిరి రావు, పరచూరి బ్రదర్స్ తదితరులు ఉన్నారు. కాగా 1936లో జన్మించిన రామానాయుడు 1963లో […]

ఫిలింఛాంబర్‌లో రామానాయుడు విగ్రహావిష్కరణ

Edited By:

Updated on: Jun 06, 2019 | 3:59 PM

మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి. రామానాయుడు 83వ జయంతి వేడుకలు ఫిల్మ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు కుటుంబం నుంచి సురేశ్ బాబు, అభిరామ్‌ పాల్గొనగా.. వారితో పాటు తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు, ఆదిశేషగిరి రావు, పరచూరి బ్రదర్స్ తదితరులు ఉన్నారు. కాగా 1936లో జన్మించిన రామానాయుడు 1963లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. 13 భారతీయ భాషల్లో 150కి పైగా సినిమాలను నిర్మించారు. ఆ తరువాత అనారోగ్యంతో 2015 ఫిబ్రవరి 18న రామానాయుడు కన్నుమూసిన విషయం తెలిసిందే.