Lavanya Tripathi: పెళ్లి రూమర్లపై స్పందించిన అందాల రాక్షసి.. వాళ్లకెలా తెలుస్తుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) . 'భలే భలే మగాడివోయ్',  'సోగ్గాడే చిన్ని నాయన', 'శ్రీరస్తు శుభమస్తు' , 'అర్జున్ సురవరం', 'చావు కబురు చల్లగా' తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Lavanya Tripathi: పెళ్లి రూమర్లపై స్పందించిన అందాల రాక్షసి.. వాళ్లకెలా తెలుస్తుందంటూ  ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Updated on: Feb 02, 2022 | 1:44 PM

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) . ‘భలే భలే మగాడివోయ్’,  ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’ , ‘అర్జున్ సురవరం’, ‘చావు కబురు చల్లగా’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న ఈ సొగసరి పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.  ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తో   డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల వరుణ్ తేజ్ తన పుట్టినరోజు నాడు లావణ్యకి  ప్రపోజల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు  వీటిపై పెద్దగా స్పందించలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో సరదాగా ముచ్చటించిన లావణ్య తన పెళ్లిపై వస్తోన్న వార్తలపై స్పందించింది.

నాకైతే తెలియదు.. మరి వాళ్లకెలా?

ప్రస్తుతం ఈ అందాల తార ‘హ్యాపీ బర్త్ డే ‘ అనే సినిమాలో నటిస్తోంది.  దీని గురించి చెప్పేందుకు ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన యంగ్ బ్యూటీ.. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. అయితే చాలామంది పెళ్లి విషయమై ఆమెను అడిగారు. మొదట్లో రిప్లై ఇవ్వని ఈ అమ్మడు అభిమానులు పదే పదే అదే ప్రశ్నలు అడగడంతో ‘ నాకైతే నా పెళ్లి గురించి తెలియదు. మరి వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో’ అంటూ అంటూ వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చింది. అయితే మరికొందరు నెటిజన్లు  ‘కేవలం పెళ్లి వార్తలను  ఖండిస్తున్నారా..? లేక ఎవరితోనూ ప్రేమలో లేనని  చెబుతున్నారా..?’  అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు లావణ్య. మౌనంగా ఉండిపోయింది. దీంతో  ఆమె పెళ్లిపై వచ్చిన రూమర్లు ఓ ఫజిల్ గానే మిగిలిపోయాయంటున్నారు నెటిజన్లు. మరి ఈ అందాల రాక్షసి పెళ్లి రూమర్లపై కాలమే సమాధానం చెప్పాలి.

Also Read:Vishwak Sen: అలరిస్తోన్న గోదావరి అల్లుడు.. విశ్వక్ సేన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

AP- Telangana: విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే.. తేల్చిచెప్పిన కేంద్రం..

Son Of India: మళ్లీ మొదలైన సినిమా జోష్.. మోహన్ బాబు సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..