ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా మహేష్‌ హీరోయిన్‌..!

రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న

ప్రభాస్ 'ఆదిపురుష్'‌.. సీతగా మహేష్‌ హీరోయిన్‌..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 17, 2020 | 9:41 AM

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. మిగిలిన పాత్రల కోసం ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందులో సీత పాత్రకు గానూ ఇప్పటికే అనుష్క, అనుష్క శర్మ, కీర్తి సురేష్‌, కియారా ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో భామ లైన్‌లోకి వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ని సీత పాత్ర కోసం అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

కాగా దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్‌ ఆదిపురుష్‌ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ విలువిద్యను సైతం నేర్చుకుంటున్నారు. 3డీలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. తెలుగు, హిందీలో ఏకకాలంలో తెరకెక్కించనున్న ఈ మూవీని మిగిలిన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.

Read More:

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,451 కొత్త కేసులు.. 9 మరణాలు