
Kriti Sanon Workout Video: ప్రాణం పెట్టి పనిచేసే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. తమ పనిలో పర్‌ఫెక్షన్ రావడం కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారి జాబితాలోకి వస్తుంది బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్. 2020లో వచ్చిన ‘మిమీ’ అనే సినిమాలో కృతీ గర్భవతిగా నటించింది. ఇందులో సహజంగా కనిపించేందుకు గాను కృతీ ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది. ఈ సినిమాలో కృతీ నటనకు ప్రశసంలు దక్కాయి. అయితే ఆ సినిమా అయిపోయింది.. మరి మళ్లీ తిరిగి మాములు బరువుకు రావాలిగా. అందు కోసమే కృతి కఠోర శ్రమను ఎంచుకుంది. సినిమాలో పెరిగిన 15 కిలోల పవర్‌ను తన పవర్ ఫుల్ డెడికేషన్‌తో తక్కువ సమయంలో తగ్గించేసింది.
తన వెయిట్ లాస్ జర్నీకి సంబంధించిన విశేషాలను కృతి సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంది. ఈ క్రమంలోనే తన వర్కవుట్ వీడియోలను పోస్ట్ చేస్తూ.. ‘‘మిమీ’ సినిమా కోసం 15 కిలోల బరువు పెరగడం నిజంగానే ఛాలెంజ్‌తో కూడుకున్న విషయం. అయితే పెరిగిన ఆ బరువును తగ్గించం కూడా అంతసులభమైన విషయమేమి కాదు. ఆ సమయంలో 3 నెలల పాటు వర్కవుట్ చేయలేదు. కనీసం యోగా కూడా చేయలేదు. అప్పుడు నా శక్తి మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ నెమ్మదిగా పూర్వరూపం సంతరించుకుంటోంది’ అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కృతి డెడికేషన్‌కు ఫ్యాన్స్ హ్యాట్సాప్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన కృతీ సనన్.. అనంతరం బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక ప్రస్తుతం ఈ చిన్నది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. కృతి సీత పాత్రలో కనిపిస్తోంది.
Also Read: Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..
Pori Moni: టాప్ హీరోయిన్ పోరి మోని లీలలు.. సంపన్నుల పిల్లలే టార్గెట్.. అమ్మాయిలను పరిచయం చేసి..