AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. మనసులో మాట చెప్పిన కృతి శెట్టి!

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.. తనకు టాలీవుడ్‌లో ఇష్టమైన హీరో ఎవరో గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించింది. స్టార్ హీరో గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. మనసులో మాట చెప్పిన కృతి శెట్టి!
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2026 | 9:56 PM

Share

కృతి శెట్టి పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే సినిమా ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమా సాధించిన విజయంతో కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. ఉప్పెన తర్వాత నాగచైతన్యతో కలిసి నటించిన ‘బంగార్రాజు’, నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు కూడా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇలా కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలను అందుకున్న కృతి శెట్టి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా మారుతుందని చాలామంది భావించారు.

అయితే కెరీర్ ప్రారంభంలో వచ్చిన విజయాలను కృతి శెట్టి ఆ తర్వాత కొనసాగించలేకపోయింది. ఆమె నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో తెలుగులో అవకాశాలు, క్రేజ్ విషయంలో కొంత వెనుకబడింది. అయినప్పటికీ నటిగా తనను తాను నిరూపించుకోవాలనే ప్రయత్నాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. మలయాళంలో టొవినో థామస్‌తో కలిసి నటించిన ‘ARM’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’  చిత్రంలో నటించింది. ఈ సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పడినప్పటికీ, విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

ఇదిలా ఉంటే.. కృతి శెట్టికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన అభిమాన హీరోల గురించి మాట్లాడిన ఆమె.. ప్రతి భాషలో తనకు ఇష్టమైన హీరోలు ఉన్నారని తెలిపింది. తెలుగులో మాత్రం రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని చెప్పింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ అభిమానులు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృతి శెట్టి తన అభిమాన హీరోతో కలిసి ఎప్పుడు నటిస్తుందా అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us