AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో మందుబాబులు బీ అలర్ట్.. రెండ్రోజుల పాటు షాపులు బంద్.. ఈ రోజుల్లోనే..

ఏపీలో మందుబాబులకు షాకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికలు జరిగే అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh: ఏపీలో మందుబాబులు బీ అలర్ట్.. రెండ్రోజుల పాటు షాపులు బంద్.. ఈ రోజుల్లోనే..
Ap Wine Shops
Venkatrao Lella
|

Updated on: Oct 18, 2026 | 9:45 PM

Share

ఏపీలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు ఉండవు. ఈ మేరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు ఏవీ తెరవకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏవైనా ఎన్నికలు జరిగే సమయంలో ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు అధికారులు మూసివేస్తారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్..

రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోలింగ్, కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల పోలింగ్ జరిగే రోజుతో పాటు కౌంటింగ్ జరిగే రోజు సర్వసాధారంగా వైన్ షాపులు మూసివేస్తారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం సరఫరా చేస్తూంటాయి. వీటిని కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషర్ ఎన్నిలకుముందు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తుంది. ఇక కౌంటింగ్ రోజున మద్యం మత్తులో జరిగే దాడులను అరికట్టేందుకు కూడా వైన్ షాపులు మూసివేసేలా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికల క్రమంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. సాధారణ వైన్ షాపులతో పాటు క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో మద్యం సర్వ్ చేయడం లాంటివి నిలిచిపోతాయి.

ముగిసిన నామినేషన్ల గడువు..

కాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అక్టోబర్ 19 నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీలో ఉండటంతో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు హీట్ రేపుతున్నాయి. అయితే దర్శిలో 25 మంది వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. గడువు ముగియడంతో నామినేషన్లు వేయలేకపోయినట్లు తెలుస్తోంది.

Follow Us