Koratala Siva News: కొరటాల శివపై మరోసారి కాపీ మరక అంటుకుంది. చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్యను తన కథ నుంచి కాపీ చేశారంటూ రాజేష్ అనే రచయిత ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పెద్దాయన అనే కథను తాను రచయితల సంఘంలో రిజిస్ట్రర్ చేయించానని ఆ తరువాత తన కథ లీక్ అయ్యిందని రాజేష్ ఆరోపించారు. ఇక ఈ కథను తాను మైత్రీ మూవీ మేకర్స్‌కి కూడా వినిపించానని, అందుకు తన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటూ వాదించారు. అంతేకాదు దీనిపై పలు ఛానెళ్ల చర్చల్లో పాల్గొని కొరటాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ సీరియస్ అయ్యారని, రాజేష్‌పై పరువునష్టం దావాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఒక చిన్న మోషన్ పోస్టర్‌ని చూసి ఇలాంటి ఆరోపణలు చేయడం ఏ మాత్రం సమంజసం కాదని, లీగల్‌గా తేల్చుకునేందకే ఆయన రెడీ అయినట్లు సమాచారం. ఇక ఆచార్య నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి లాయర్ అవ్వడంతో, దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపడం, ఆయన ఫార్మాలిటీస్ పూర్తి చేయడం జరిగాయని టాక్. అయితే కొరటాలపై గతంలోనూ కాపీ మార్కు పడింది. మహేష్ బాబు హీరోగా కొరటాల తెరకెక్కించిన శ్రీమంతుడును తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ శరత్ చంద్ర అనే రచయిత కోర్టులో కేసు వేశారు. ఈ కేసు ఇప్పటికీ కొలిక్కి రాని సంగతి తెలిసిందే.
Read More:
సురేందర్ రెడ్డి మూవీ.. అఖిల్ పాత్రపై ఆసక్తికర వార్త!
వ్యాపారి కుటుంబంలో ‘కరోనా’ విషాదం.. 20 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి